ప‌ద్దెనిమి సంవత్సరాలు నిండిన వారంద‌రు ఓటర్లుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలి – గ‌వ‌ర్న‌ర్‌

0
409
Spread the love

ప‌ద్దెనిమి సంవత్సరాలు నిండిన వారంద‌రు ఓటర్లుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలి – గ‌వ‌ర్న‌ర్‌

ప‌ద్దెనిమి సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకుని అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ యువతకు పిలుపునిచ్చారు. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవం ఓటరు జీవితంలో ప్రముఖమైన రోజని ఎందుకంటే ఓటు హక్కును ఇచ్చిన రోజని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కును నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలన్నారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ఎన్నికలు ముఖ్యభూమిక వహిస్తాయని ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలన్నారు. భారత దేశ ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు దేశంలో నిర్వహిస్తున్న ఎన్నికల విధానాన్ని ప్రశంసించారని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మొట్ట మొదటి సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను గవర్నర్ అభినందించారు. దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. పంచాయితీ ఎన్నికలలో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును అధిక శాతంలో వినియోగించుకునేందుకు వస్తున్నందున రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని గవర్నర్ అభినందించారు.
యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు హ‌క్కును వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఎన్నికల రోజును సెలవు దినంగా పరిగణించకుండా తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. లోక్ స‌భ‌ ఎన్నికల్లో 90 శాతం ఓటింగ్ జరిగేలా ప్రయత్నం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్‌, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్, అడిషనల్ సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్‌ సీఈవో ఆమ్రాపాలి గవర్నర్ చేత అవార్డులందుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు వ్యాసరచన పోటీలలో గెలిచిన విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్‌ సీఈవో ఆమ్రపాలి, జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here