చిన్నారులను అమ్మేసిన ఘటనపై స్పందించిన‌ ఎన్సీపీసీఆర్ సభ్యురాలు

0
123
Spread the love

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ డాక్టర్‌తోపాటు ఐదుగురి బృందం ఐదేళ్లుగా 28 మంది చిన్నారులను అమ్మేసిన ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి (ఎన్సీపీసీఆర్) సీరియస్ గా స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన నివేదిక ఇవ్వాలని బెంగళూరు (దక్షిణం) డిప్యూటీ పోలీసు కమిషనర్ హరీశ్ పాండేకు లేఖ రాసింది.

ఈ ఘటనపై ఎన్సీపీసీఆర్ సభ్యురాలు (జువెనైల్ జస్టిస్) శ్రీమతి ప్రజ్ఞా పరాండే స్పందించారు. ‘జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అక్రమంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం తీవ్రమైన నేరం. ఓ చిన్నారిని దత్తత తీసుకునేటప్పుడు ఆ చిన్నారికి న్యాయబద్ధమైన భద్రత కల్పించేందుకు అవసరమైన విధివిధానాలను జువెనైల్ జస్టిస్ యాక్ట్ చెబుతుంది. దత్తత విధివిధానాలు కాస్త కఠినంగా ఉన్నట్లు కనిపించినా.. చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ చట్టం లక్ష్యం’ అని ఆమె అన్నారు.
చిన్నారి శారీరక, మానసిక, సాంఘిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిందేనని, జువెనైల్ జస్టిస్ చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించేవారిని ఉపేక్షించబోమని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here