చిన్నారుల ఎదుగుదలలో సానుకూలమైన వాతావరణం కీలకం: ప్రజ్ఞాపరాండే

0
211
Spread the love

చిన్నారుల ఎదుగుదలలో సానుకూలమైన వాతావరణంలో పెంపకం అత్యంత కీలకం: ప్రజ్ఞాపరాండే

– బాలల సంరక్షణ కార్యక్రమాల్లో తండ్రిని కూడా భాగస్వామిని చేయాలి
– గర్భిణిగా ఉన్నప్పటినుంచే యోగ, ధ్యానం ద్వారా శిశువు సర్వతోముఖాభివృద్ధి సాధ్యం
– తల్లిపాలను తప్పనిసరిగా పట్టించడం తల్లు బాధ్యతన్న ఎన్సీపీసీఆర్ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా పరాండే


ఇంట్లో సానుకూలమైన వాతావరణం, ఇలాంటి వాతావరణంలో చిన్నారుల పెంపకం వారి ఎదుగుదలలో అత్యంత కీలకమని జాతీయ బాలల హక్కుల సంరక్షణ మండలి (ఎన్సీపీసీఆర్) సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞాపరాండే పేర్కొన్నారు. గర్భిణిగా ఉన్నప్పటినుంచే తల్లులు యోగ, ధ్యానంను అలవర్చుకుంటే దాని ప్రభావం తర్వాతి రోజుల్లో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. తల్లిపాలను అందించడం, చిన్నారుల పెంపకం, శిశువుల పౌష్టికాహారం తదితర అంశాలపై గర్భిణులకు శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. సక్షమ్, యునిసెఫ్, సుస్నేహ హెల్త్ ఫౌండేషన్, ఫెర్నాండేజ్ ఫౌండేషన్, సీఎల్ఎంసీ, ధాస్త్రి మదర్ మిల్క్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఆర్యజనని’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆన్ లైన్ ద్వారా ప్రజ్ఞాపరాండే పాల్గొన్నారు. చిన్నారుల శారీరక, మానసికాభివృద్ధి గురించిన అంశాలను, ఎన్సీపీసీఆర్ సభ్యురాలిగా దేశవ్యాప్తంగా పర్యటనల ద్వారా వివిధ వర్గాల వారిని కలుసుకోవడం, వారితో మాట్లాడటం ద్వారా గడించిన అనుభవాన్ని ఈ సమావేశంలో పాల్గొన్నవారితో పంచుకున్నారు.
చిన్నారులపై మానసిక ఎదుగుదలలో ఇంట్లో ఉండే సానుకూల వాతావరణమే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పిల్లల సంరక్షణలో తల్లితోపాటు తండ్రిని కూడా భాగస్వామిని చేయడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్ మాసం’కార్యక్రమం ద్వారా గర్భిణుల ఆరోగ్యం, వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం సంబంధిత అంశాలపై విస్తృతమైన అవగాహన ఏర్పడిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల మౌలిక కల్పనపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య దేవరాజన్, రామకృష్ణ మఠ్ చైర్మన్ స్వామి శితికంఠానంద, సక్షమ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుకుమార్, సేవాంకుర్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ అశ్విని కుమార్ తోపాటు కార్యక్రమ నిర్వాహకులు, వైద్యులు, వివిధ రంగాల ప్రతినిధులు, ఆరోగ్య భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here