ఢిల్లీలో ఆరు రోజుల పాటు క‌ఠిన లాక్‌డౌన్

0
257
Spread the love

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఆరు రోజుల పాటు క‌ఠిన రీతిలో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఇవాళ ‌రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం ఉద‌యం 5 గంటల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌న్నారు. ఢిల్లీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఆ న‌గ‌రంలో 25 వేల కేసులు న‌మోదు అయ్యాయి. న‌గ‌రంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ చాలా వ‌త్తిడికి లోను అయ్యింద‌ని, వ్య‌వ‌స్థ కుప్ప‌కూల‌కుండా ఉండేందుకు క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ పొడిగించ‌రాదు అని భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇవాళ అర్థ‌రాత్రి నుంచి లాక్‌డౌన్ మొద‌లవుతుంది.

ఢిల్లీలో నాలుగ‌వ ద‌శ క‌రోనా ఉదృతి న‌డుస్తోంద‌ని కేజ్రీ తెలిపారు. ఒకే రోజే 25వేల కేసులు న‌మోదు అయ్యాయ‌ని, ఢిల్లీ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై వ‌త్తిడి పెరిగింద‌ని, ప్ర‌స్తుతం వ్య‌వ‌స్థ కుప్ప‌కూల‌లేదు, కానీ వ‌త్తిడి పెరిగింద‌న్నారు. న‌గ‌రంలో పాజిటివిటీ రేటు, ఇన్‌ఫెక్ష‌న్ రేటు పెరిగింద‌న్నారు. ఒకే రోజు 25వేల మంది రోగులు హాస్పిట‌ల్‌కు వ‌స్తే అప్పుడు అది స‌మ‌స్య అవుతుంద‌ని, ఢిల్లీలో బెడ్స్ కొర‌త ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, ఫుడ్ స‌ర్వీసెస్‌, మెడిక‌ల్ స‌ర్వీఎస్ కొన‌సాగుతాయ‌న్నారు. పెండ్లిల్లు కేవ‌లం 50 మందితో నిర్వ‌హించుకోవాల‌న్నారు. ఆ వేడుక‌ల కోసం ప్ర‌త్యేక పాస్‌లు ఇస్తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here