ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

0
61
Spread the love

ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

 మిజోరాం గవర్నర్ గా మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు 

        హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ బదిలీ

న్యూ డిల్లీ జూలై 6 (ఎక్స్ ప్రెస్ న్యూస్);ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న తెలంగాణ బీజేపీ నేత దత్తాత్రేయను.. హర్యానా గవర్నర్ గా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దత్తాత్రేయ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ కు రాజేంద్రన్ విశ్వనాథ్ ను పంపించింది. అదేవిధంగా.. కర్నాటక గవర్నర్ గా థావర్ చంద్ గెహ్లాట్ ఎంపికయ్యారు. థావర్ చంద్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.అదేవిధంగా.. గోవా రాష్ట్రానికి గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లై నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం మిజోరాం గవర్నర్ గా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగూబాయి చగన్ భాయ్ పటేల్ త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య జార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బయాస్ నియమితులయ్యారు.కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ల నియామకం చేపట్టడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఆశావహులుగా ఉన్నవారిని బుజ్జగించేందుకు కేంద్రం ఈ నియామకాలు చేపట్టిందనే ప్రచారం సాగుతోంది. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ప్రకటించడంతో అతి త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుదిరితే రేపే కేబినెట్ ను విస్తరించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here