వివిధ భాషల్లో చలచిత్రాల నిర్మాణం- సహ నిర్మాణం కోసం దరఖాస్తుల ఆహ్వానం

0
147
Spread the love

ఎన్.ఎఫ్.డి.సి వివిధ భారతీయ భాషల్లో చలచిత్రాల నిర్మాణం/సహ నిర్మాణం కోసం దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, డిసెంబర్ 24, 2021

నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘‘వివిధ భారతీయ భాషల్లో చలనచిత్రాల నిర్మాణం’’ అనే స్కీము ద్వారా వివిధ భాషల్లో చిత్ర నిర్మాణాల కోసం అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం ఎన్.ఎఫ్.డి.సి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, తాము పూర్తి చేసిన దరఖాస్తులను https://nfdcindia.com/apply-now/ కు పంపించగలరు. పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ముంబై కార్యాలయం, 6వ అంతస్తు, డిస్కవరీ ఆఫ్ ఇండియా బిల్డింగ్, డా. అనిబిసెంట్ రోడ్, నెహ్రూ సెంటర్, వర్లీ, ముంబై-400 018 కు పంపించవలసి ఉంటుంది.
అంతేకాకుండా, అభ్యర్థులు https://www.nfdcindia.com/contact-us/ ని సందర్శించి, తమ దరఖాస్తులను న్యూ ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, తిరువనంతపురంలోని ఎన్.ఎఫ్.డి.సి ప్రాంతీయ కార్యాలయాలకు కూడా పంపించవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తులను 2022 జనవరి 31వ తేదీలోపు పంపించవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ – 022 66288 288, తమ సందేహాల నివృత్తి కోసం filmproduction@nfdcindia.com కు కూడా మెయిల్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here