నేటి నుంచి ఏప్రిల్ 30వ‌ తేదీ వ‌ర‌కు తెలంగాణలో రాత్రి క‌ర్ఫ్యూ

0
77
Spread the love

హైద‌రాబాద్ ఏప్రిల్ 20 (ఎక్స్ ప్రెస్ ఏవ్స్ );: క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30వ‌ తేదీ వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్నారు.ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాలు, సంస్థ‌లు, దుకాణాలు, కంపెనీలు, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్ల‌ను రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మూసివేయాలి. రాత్రి 9 గంట‌ల త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌లు కానుంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు, మెడిక‌ల్ సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు త‌ప్ప‌నిస‌రిగా ఐడీ కార్డుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉంచుకోవాలి. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌కు వెళ్లే ప్ర‌యాణికులు వ్యాలిడ్ టికెట్ల‌ను వ‌ద్దే ఉంచుకోవాలి. అంత‌ర్ రాష్ర్ట స‌ర్వీసులు, రాష్ర్ట స‌ర్వీసులు య‌థావిధిగా కొన‌సాగ‌నున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here