ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ లో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు

0
114
Spread the love

ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ లో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు

హైదరాబాద్, డిసెంబర్ 7, 2021

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ) ఆధ్వర్యంలో ఆంత్రప్రెన్యూర్ షిప్, స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు నిమ్స్ మే డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. నిరుద్యోగ యువత నైపుణ్యాల వృద్ధికి ఎటిఐ పథకంలో భాగంగా యూసఫ్ గూడ లోని ‘నిమ్స్ మే’ (niMSME) లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ లైన్ లో యానిమేటర్, వి.ఎఫ్.ఎక్స్ ఎడిటర్, బేకింగ్ టెక్నీషియల్, అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్, బ్యూటీ థెరపిస్ట్, ఆన్ లైన్ లో జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్, క్లౌడ్ ఇంజినీర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, వెబ్ డెవలపర్, డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (పే రోల్), జి.ఎస్.టి అకౌంట్స్ అసిస్టెంట్, మల్టీఫంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. వివరాలకు www.nimsme.org వెబ్ సైట్, 040-23633217, 23633236, info@nimsme.org ద్వారా సంప్రదించవచ్చని గ్లోరి స్వరూప తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here