జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోవద్దు

0
144
Spread the love

జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోవద్దు

సీబీఐ కొత్త డైరెక్ట‌ర్ సుబోధ్ కుమార్ అధికారులు, సిబ్బందికి కీల‌క ఆదేశాలు 

న్యూఢిల్లీ జూన్ 4 (ఎక్స్ ప్రెస్ న్యూస్ >. : సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్ట‌ర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ త‌న అధికారులు, సిబ్బందికి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ‌ద‌ని, హుందాగా క‌నిపించే ఫార్మ‌ల్ డ్రెస్సులే వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం సీబీఐలో ప‌ని చేసే పురుషులు ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వేసుకోవాలి. ప్ర‌తి రోజూ నీట్‌గా షేవ్ చేసుకోవాల్సిందే. ఇక మ‌హిళా అధికారులైతే చీర‌లు, సూట్లు, ఫార్మ‌ల్ ష‌ర్ట్స్, ప్యాంట్లు మాత్ర‌మే వేసుకోవాలి.ఆఫీస్‌లో జీన్స్‌, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూస్‌, చెప్పులు, క్యాజువ‌ల్ వేర్ ఏదీ అనుమ‌తించ‌బోము అని ఆ ఆదేశాల్లో డైరెక్ట‌ర్ సుబోధ్ స్ప‌ష్టం చేశారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖ‌ల హెడ్స్ క‌చ్చితంగా ఈ ఆదేశాలు అమ‌లయ్యేలా చూడాల‌ని కూడా అందులో తేల్చి చెప్పారు. నిజానికి ఎప్ప‌టి నుంచో ఇలాంటి డ్రెస్సింగ్ సీబీఐలో ఉన్నా.. గ‌త కొన్నేళ్లుగా కొంద‌రు క్యాజువ‌ల్స్ వేసుకోవ‌డం ప్రారంభించార‌ని, అయితే ఇన్ని రోజులూ వారిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేద‌ని ఓ సీబీఐ అధికారి అన్నారు. ఈ ఆదేశాలు ఒక‌ర‌కంగా మంచివేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త వార‌మే సీబీఐ 33వ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సుబోధ్‌.. రానున్న రోజుల్లో సీబీఐ ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు కొన్ని కీల‌క చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు సీబీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here