ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట లో ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమం

0
69
Spread the love

ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట లో ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమం


హైదరాబాద్, అక్టోబర్ 12, 2021 ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్.వై.కె.ఎస్), జాతీయ సేవ పథకం (ఎన్.ఎస్.ఎస్) సంయుక్తంగా ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు హైదరాబాద్ లోని గోల్కొండ కోట ప్రాంగణంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట ప్రాంగణం పరిసర ప్రాంతాల నుండి సుమారు 285 కిలోల వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ రాష్ట్ర సంచాలకులు శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ, అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలంగాణాలోని పలు జిల్లాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియ జేశారు.

భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల స్మారకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా భారత ప్రభుత్వం పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 1న ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రామకృష్ణ పేర్కొన్నారు.

గోల్కొండ కోట ఇన్ ఛార్జ్ శ్రీ నవీన్, ఎన్‌వైకెఎస్‌ జిల్లా అధికారి ఖుష్బూ గుప్తా, ఎన్ఎస్ఎస్ యూత్ అసిస్టెంట్ శ్రీ కె.సి. రెడ్డి, సుమారు వంద మంది ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here