ఈ నెల 28న నోవా టెల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్

0
64
Spread the love

ఈ నెల 28న నోవా టెల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్

హైదరాబాద్, డిసెంబర్ 23 :: జాతీయ వంట నూనెల అభివృద్ధి మిషన్ లో భాగంగా ఈ నెల 28 న హైదరాబాద్ హెచ్.ఐ.సి.సి లోని నోవా టెల్ హోటల్ లో ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మిట్ లో 9 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులు , ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు , శాఖధిపతులు, రైతులు, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, ఆయిల్ పామ్ ప్రాసెసర్ లు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల నుండి దాదాపు 250 మంది డెలిగేట్స్ హాజరుకానున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here