చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. కాంస్యం అందుకున్న పీవీ సింధు

0
153
Spread the love

టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. కాంస్యం అందుకున్న పీవీ సింధు

Tokyo Olympic 2021: టోక్యో ఒలింపిక్స్‌ . . మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కంచు మోగించింది పీవీ సింధు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. నిన్నటి లోపాలను సరిదిద్దుకొని సింధు చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై అవలీలగా గెలిచింది.

పీవీ సింధు కాంస్యం పతకం అందుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై ఆదినుంచి అధిపత్యం చెలాయించింది. పదునైన ఏస్ లతో ర్యాలీలతో విరుచుకుపడింది. మొదటి సెట్ ను 21-13 తేడాతో పీవీ సింధు సొంతం చేసుకుంది. రెండో సెట్ లో కూడా హోరాహోరీగా తలపడింది. రెండో సెట్ లో బింగ్‌ జియావో పై ఆధిపత్యం కొనసాగించింది. 21-15 తేడాతో గెలిచి.. మ్యాచ్ తో పాటు టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం అందుకుంది. దీంతో భారత రెండో పతకం లభించింది.

సింధు, బింగ్‌ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గింది. దీంతో పీవీ సింధు రెండు ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలను సాధించిన మొదటి భారతీయ మహిళాగా రికార్డ్ సృష్టించింది. గత రియో ఒలంపిక్స్ లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు రెజ్లర్ సుశీల్ కుమార్. అతను 2008 బీజింగ్‌లో జరిగిన క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అనంతరం లండన్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించాడు, దేశంలో ఏకైక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయ్యాడు. ఇప్పుడు సుశీల్ తర్వాత తెలుగు తేజం సింధు ఈ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

పీవీ సింధుకు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు అభినంద‌న‌లు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు చ‌రిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా ఆమె నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here