ఇంటి వద్ద అయితే 750, 34 రోజుల్లో రెండోసారి తగ్గింపు

0
158
Spread the love

జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభత్వం

రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌ల్లో నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల ధరలను మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొవిడ్‌ నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లో చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధర రూ.850 ఉండగా, దాన్ని రూ.500కు తగ్గ్గించింది. అలాగే ఇంటివద్దే తీసుకొనే శాంపిల్‌ పరీక్ష ధరను రూ.1200 నుంచి 750కు తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు రూ.వేలల్లో ఉన్న టెస్టుల ధర ఇప్పుడు వందల్లోకి వచ్చింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధరలను మరింత తగ్గించాలని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు ఈ నెల 16న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

పరిశీలించిన సర్కారు.. ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధరను రూ.500కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర రూ.499గా నిర్ణయించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here