భారత స్వాతంత్య్ర‌ సంగ్రామ ఘట్టాలపై గేమ్‌ల సిరీస్

0
114
Spread the love

భారత స్వాతంత్య్ర‌ సంగ్రామ ఘట్టాల ఆధారంగా రూపొందించిన ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ గేమ్‌ల సిరీస్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా భారత స్వాతంత్య్ర‌ పోరాట కథలను ఆటల రూపంలో పరిచయం చేసేందుకు ‘ ఆజాదీ క్వెస్ట్ ‘ పేరిట రూపొందిన ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రారంభించారు. జింగా ఇండియా సహకారంతో ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర తో పాటు జింగా ఇండియా కంట్రీ హెడ్ శ్రీ కిషోర్ కిచ్లీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ అనురాగ్ ఠాకూర్ స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను గుర్తు చేసుకుని, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించి, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధుల కథలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా మొబైల్ ఆటలు రూపొందించామని అన్నారు.

భారతదేశంలో ఆన్‌లైన్ క్రీడలకు ఉన్న మార్కెట్ అవకాశాల ద్వారా ప్రయోజనం పొందడంతో పాటు ప్రజలకు ఆటల ద్వారా అవగాహనను కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు సేకరించాయని మంత్రి వివరించారు. అనేది ఈ జ్ఞానానికి సంబంధించిన అంశాలను ఆకర్షణీయంగా రూపొందించి సమగ్ర వివరాలతో ఆజాదీ క్వెస్ట్ రూపొందిందని మంత్రి వివరించారు. అన్ని వయసుల వారు ఈ ఆటల పట్ల ఆకర్షితులు అవుతారని అన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆటలకు ఆకర్షితులవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశంలో ఏవిజిసి రంగం అభివృద్ధి చెందుతున్నదని శ్రీ ఠాకూర్ అన్నారు. భారతదేశంలో ఏవిజిసి రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సహకారాన్ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అందిస్తున్నదని హామీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ రంగంలో ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లో భారతదేశం స్థానం సాధించిందని శ్రీ ఠాకూర్ తెలిపారు. గేమింగ్ రంగం 2021లోనే 28% వృద్ధి చెందిందాని మంత్రి వెల్లడించారు. ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 2020తో పోల్చి చూస్తే 2021లో 8 శాతం వరకు పెరిగిందని తెలిపారు. 2023 నాటికి ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 45 కోట్లకు చేరుతుందని మంత్రి తెలిపారు.

కొత్తగా ఆవిష్కరించిన యాప్‌లు దేశ ఏవిజిసి రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అద్భుతమైన చరిత్రను ప్రపంచం నలుమూలలకు తీసుకు వెళతాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌లలో పొందుపరిచిన సమాచారాన్ని పబ్లికేషన్స్ డివిజన్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ క్రోడీకరించి పొందుపరిచాయని మంత్రి తెలిపారు. మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ప్రామాణికమైన సమాచారం సులభంగా లభిస్తుందని తెలిపిన మంత్రి సమాచారం జ్ఞాన నిధిగా ఉంటుందని అన్నారు.
ఈ యాప్‌లను రూపకల్పనలో జింగా ఇండియా చేసిన కృషిని మంత్రి అభినందించారు. అన్ని వయసుల వారు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రి కోరారు. దేశ స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన విద్యా సాధనంగా యాప్‌ మారుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here