పెయింటింగ్ ప్రదర్శనను ప్రారంభించిన మేయర్

0
97
Spread the love

వజ్రోత్సవాల స్ఫూర్తితో సాలార్ జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శనను ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, ఆగస్టు 17:
    స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో సాలార్ జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో భాగ్యనగర్ సొసైటీ సహకారంతో   ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను  బుధవారం మేయర్  గద్వాల్  విజయలక్ష్మి  ప్రారంభించారు. సాలార్ జంగ్ మ్యూజియం ఆవరణలో దేశభక్తి, స్వతంత్ర సంగ్రామ చరిత్ర పై గత నెల 23 నుండి 25 వరకు పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… స్వాతంత్య్ర సాధనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలు స్మరించుకునే కృషితో పాటు 75 వసంతాలలో దేశం సాధించిన ప్రగతి భావి తరాల వారికి స్ఫూర్తి నిచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా విజయవంతంగా జరుగుతున్నాయని ఇందులో కవులు రచయితలు, విద్యార్థులు, జానపద కళాకారులను ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసినట్లు మేయర్ పేర్కొన్నారు.

 

ఈ పోటీల్లో  జే.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్, వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్, తెలంగాణ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్, సెంట్రల్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్ విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న 75 మంది వేసిన పెయింటింగ్ లను ప్రదర్శించారు. ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తిలకించి  అవార్డులు ప్రకటించారు. ప్రథమ  బహుమతి ప్రభుదేవా, ద్వితీయ బహుమతి దేవేందర్, తృతీయ బహుమతి శ్రావ్య వీరందరూ జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్ కు చెందిన వారు.  ఈ కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డా.ఏ.నాగేందర్ రెడ్డి, కన్సల్టెన్సీ వీరేందర్, భాగ్యనగర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ బాధ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here