ఈ గుడి చిరపరిచితమైనదానిలా………… ఢిల్లీలో , ప్రజాస్వామ్యానికి నెలవైన పార్లమెంటులాగానే ఉంది.

0
83
Spread the love

ఈ గుడి చిరపరిచితమైనదానిలా..
ఎన్నో సార్లు చూసినట్టు అనిపిస్తుంది. “ఎక్కడ చూశాం దీన్ని… ఎక్కడ చూశాం?” అని
మనసులో ప్రశ్నలు పాశుపతాస్త్రాలౌతాయి.
“ఇది మన పార్లమెంటు భవనంలా లేదూ….!!?” అని ఒక్కసారి స్ఫురిస్తుంది.

నిజమే…. ఢిల్లీలో , ప్రజాస్వామ్యానికి నెలవైన పార్లమెంటులాగానే ఉంది….” అనిపిస్తుంది.

లాగానే ఉండటమేమిటి? ఈ గుడి నిర్మాణ శైలిని చూసి ప్రేరణ పొందిన బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్వర్డ్ బేకర్, లుట్యెన్స్ లు 1912 లో మన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.

ఈ నిర్మాణ శైలి వారినిఎంతగాఆకట్టుకుందంటే వారింకే మోడల్నూ పరిశీలించ లేదు. పార్లమెంటు భవనం దీనిలాగానే ఉండితీరాలన్న నిర్ణయానికి వచ్చేశారు. కొద్ది మార్పులతో పార్లమెంటు మోడల్ సిద్ధమైంది. అందరి ఆమోదమూ లభించాక నిర్మాణం మొదలైంది. అచిర కాలంలోనే ఢిల్లీ తలపై మకుట మణిలాంటి అందమైన పార్లమెంటుభవనంతయారైంది.

పార్లమెంటుకే మాతృక అయిన ఆ గుడిపేరు ఏకాటేశ్వర మందిర్. మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మొరీనా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మతౌలీ అన్న చిన్న గ్రామంలో ఈ మందిరం ఉంది.

ఏకాటేశ్వర మందిరం 8వ శతాబ్దం నాటిది. ప్రతీహార రాజుల ప్రాచీన భవన నిర్మాణశైలీ వైభవం ప్రాణం పోసుకున్నట్టుండే ఈ దేవాలయానికి వందస్తంభాలు. కానీ ఒకే ఒక్క ప్రవేశ ద్వారం. లోపలకి వెళ్లగానే చక్రాకారంలో ఉన్న ఆ కట్టడం నట్టనడుమ గర్భగుడి….. అందులో ఏకాటేశ్వరనాథుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

చక్రాకార భవనంలో 64 గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక్కో శివలింగం… ఆ శివలింగాన్ని అర్చిస్తున్న ఒక్కో యోగిని విగ్రహం ఉంటాయి. అందుకే దీన్ని చౌసట్టి యోగిని దేవాలయం అని కూడా చెబుతూంటారు.

కాలం పెట్టిన పరీక్షలకు తట్టుకుని, శతాబ్దాల దాడుల్ని సహించి మరీ మతౌలీలో పార్లమెంటు మాతృక మృత సంజీవనిని సేవించిన భారతీయ ధర్మవైభవంలా నిలిచింది.

ఆధునికుల అలక్ష్యం. పాలకుల నిర్లక్ష్యం వల్ల అవహేళనకు గురౌతున్న మన ధర్మం లాగానే గుడి కూడా జీర్ణావస్థకు చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here