పోలీసు పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్టు

0
163
Spread the love

పోలీసు పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్టు

పోలీస్ అని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వర్ధన్నపేట పోలీసు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు అభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెలఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ, నల్లగొండ జిల్లా, దామచర్ల మండలం, గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన నిందితుడు బానోత్ వెంకటేశ్ 2018 సంవత్సరంలో బార్డర్ సెక్యూరీటి ఫోరకు ఎంపికై అస్సాం దిస్సూర్ ప్రాంతంలో మూడు నెలల శిక్షణ అనంతరం. శిక్షణ కఠినంగా వుందడంతో బి.ఎస్.ఎఫ్ శిక్షణా కేంద్రం నుండి తిరిగి వచ్చాడు. అనంతరం నిందితుడు కానిస్టేబుళ్ళ ఉద్యోగ నియామకం కోసం నిర్వహించే పోటీ పరీక్షల కోసం 2019వ సంవత్సరంలో దిల్‌షుఖ్ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతూ అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ నిందితుడు అదే ప్రాంతంలో ఫ్యాన్సీ షాపులో విధులు నిర్వహిస్తున్న యువతి పరిచయం కాగా ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇదే సమయంలో నిందితుడు ఎల్.బి నగర్ ప్రాంతంలో ద్వీచక్ర వాహనాలను అద్దెకిచ్చే ఓగో సంస్థ నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకోని ఆ వాహనాన్ని తన స్వంత అవసరాలకు వాడుకోనేందుకు దానికి వున్న జి.పి.ఎస్ పరికారాన్ని తొలిగించాడు. లా డౌన్ కారణంతో స్వగ్రామానికి తిరిగివచ్చిన నిందితుడు తాను మిర్యాలగూడలో చదువుకున్న కాలేజీలో కబడ్డీ
క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తుండంతో మిర్యాలగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని రోజు కబడ్డీ క్రీడలో శిక్షణ పోందేవాడు. ఈ నెల 21తేదిన దిల్ షుఖ్ నగర్ లో ప్రేమించిన యువతి తాను నెక్కోండలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి అని తెలపడంతో నిందితుడు మిర్యాలగూడ నుండి హైదరాబాదు ద్వీచక్రవాహనంపై వచ్చి అదే రోజు రాత్రి సదరు యువతి ఇంటిలో నిద్రించి మరుసటి రోజు 22వ తేదిన తెల్లవారుజామున తాను బి.ఎస్.ఎఫ్ శిక్షణ సమయంలో వినియోగించిన జంగిల్ డ్రెస్ కు సంబంధించిన ఫ్యాంట్ ను ధరించి తన ప్రియురాలితో కలిసి బయలుదేరి ఉదయం సమయంలో నిందితుడు ఆమెను నెక్కోండలోని తన ఇంటి వద్ద దింపి తిరుగు ప్రయాణమయ్యాడు. నిందితుడు మిర్యాలగూడకు తిరిగి వెళ్ళేందుకుగాను చింతినెక్కోండ ఉప్పరపల్లి క్రాస్, తోర్రూర్ మీదుగా ప్రయాణం అయ్యాడు. ఇదే సమయంలో నిందితుడు ఒక కర్రను తన వెంట తెచ్చుకున్నాడు. నిందితుడు తోర్రూరు వైపు ప్రయాణిస్తుండగా రాయపర్తి మండలం జయరాం తండా క్రాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి బ్యాగను భుజానికి వేసుకోని రోడ్డుపై నిలుచోని వుండగా సదరు వ్యక్తి వద్దకు వెళ్ళి తాను తోర్రూర్ పోలీస్ గా పరిచయం చేసుకోని లాక్ డౌన్ వేళ ఇక్కడ ఏంచేస్తున్నావని అడగడంతో సదరు వ్యక్తి ఖంగుతిని తనను హరిశంకర్ గా పరిచయం చేసుకోని తాను వరంగల్ నుండి బంగారు వుస్తువులు తీసుకోని తోర్రూర్ లోని బంగారు షాపు యజమానికి అందజేసేందుకుగా వెళ్ళుతున్నాని తన బ్యాగులోని బంగారు అభరణాలను చూపించాడు. దీనితో సదరు వ్యక్తి నుండి బంగారు చోరీ చేసి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో తన ప్రియురాలితో కల్సి జల్సా చేయవచ్చనే అలోచనతో నిందితుడు భాధితుడు హరిశంకర్ ను బెదిరించి అతని వద్దనున్న బంగారు అభరణాలతో పాటు, సెల్ ఫోన్ ను దోపిడీ చేసి ద్వీచక్రవాహనంపై పారిపోయాడు. కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం నిందితుడు భాధితుడి సెల్ ఫోన్ ను ఎస్.ఆర్.ఎస్.పి కాలువలో పడవేసి, దోపిడి చేసిన బంగారు అభరణాలోని ఒక ఉంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తికి 11వేలకు అమ్మివేశాడు.
భాధితుడు హరిశంకర్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకోనేందుకు గాను వెస్ట్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి వెంకటలక్ష్మి , వర్థన్నపేట ఎ.సి.పి రమేష్ కుమార్ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, వర్ధన్నపేట ఎస్.ఐ వంశీకృష్ణ అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు, ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలకు సంబంధించిన దృష్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. నిందితుడు తాను చోరీ చేసిన బంగారం అమ్మగా వచ్చిన డబ్బుతో నెక్కోండలోని తన ప్రియురాలిని తీసుకోనిపోయి జల్సా చేయాలనే ఆలోచనతో తిరిగి నిందితుడు నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో జంగిల్ ప్యాంట్, నల్లబూట్లతో ద్వీచక్రవాహనంపై వరంగల్‌కు వస్తుండగా రాయపర్తి మైలారం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అనుమానస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకోని అతనిని తనీఖీ చేయగా నిందితుడు వద్ద బంగారు అభరణాలు గుర్తించిన పోలీసులు నిందితుడి అరెస్టు చేసి విచారించగా నిందితుడు పాల్పడిన దోపిడీని పోలీసుల ఎదుట అంగీకరించగా పోలీసులు బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, నకీలీ గుర్తింపు కార్డు మరియు ద్వీచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దోపీడీ సంఘటనలో నిందితుడిని సకాలంలో అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన వర్గన్నపేట ఎ.సి.పి రమేష్, సర్కిల్ ఇన్స్పె క్టర్ విశ్వేశ్వర్, ఎస్.ఐ వంశీకృష్ణ, జఫర్‌గడ్ ఎస్.ఐ కిషోర్ , ఎ.ఎ.ఓ సల్మాన్పషా, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రమేష్, సురేష్, సోంచందర్, కృష్ణంరాజు, కనకస్వామి, మహేందర్, సైబర్ క్రైం కానిస్టేబుల్ ఆంజనేయులును వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here