మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

0
127
Spread the love

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

    హైదరాబాద్‌లో రూ.100కు చేరువైన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ జూన్ 1 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్ 23 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.49, లీటర్‌ డీజిల్‌ రూ.85.38కు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరాయి. మేలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 17వ సారి ధరలు పైకి కదిలాయి.దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101కి చేరువైంది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32 పలుకుతోంది. మరో వైపు హైదరాబాద్‌లో ధర రూ.100కు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్‌ రూ.98.20.. డీజిల్‌ రూ.93.08కు పెరిగాయి. ఇదిలా ఉండగా.. ముడి చమురు ధరలు సోమవారం పెరగ్గా బ్యారెల్‌ 70 డాలర్లకు.. బ్రెంట్ 0.5 శాతం పెరిగి బ్యారెల్ 69.79 డాలర్లకు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here