ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రికి పోటెత్తిన భక్తులు
నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడు గరుడ వాహనంపై లక్ష్మీ సమేత నరసింహుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు….ఉదయం ఆరుగంటల ముప్పై నిముషములకు వేద మంత్రాలు,మంగళ వాయిద్య ల,అర్చకుల మంత్రోత్సరణల నడుమ వజ్ర వైడూర్యాలతో అలంకరించిన నరసింహుడు ధగధగా వేరుస్తు ఉత్తర ద్వార నుండి దర్శనమివ్వగా నరసింహుని జయజయ ధ్యానాల నడుమ మహిళ భక్తులు మంగళ హారతులతో స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు…ఉదయం ఆరుగంటల ముప్పై నిముషముల నుండి తొమ్మిది గంటల వరకు రెండున్నర గంటల పాటు యాదగిరిశుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు….కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకున్నారు.