దేశంలోని సామాజిక కార్య‌క‌ర్త‌ల కృషి ఎన‌లేనిది: ప్ర‌ధాని మోదీ

0
215
Spread the love

దేశంలోని సామాజిక కార్య‌క‌ర్త‌ల కృషి ఎన‌లేనిది: ప్ర‌ధాని మోదీ

దేశంలోని సామాజిక కార్య‌క‌ర్త‌ల కృషి ఎన‌లేనిది: ప్ర‌ధాని మోదీ

Toofan, March 28, 2021 న్యూఢిల్లీ: స‌మాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఎంతో కృషి చేస్తున్నార‌ని, వారి కృషి ఎన‌లేనిద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. మ‌న్ కీ బాత్ 75వ ఎపిసోడ్‌లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తున్న ప‌లువురిపై ప్ర‌శంస‌లు కురిపించారు. విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పడకండ్ల గురించి ప్ర‌ధాని ప్రస్తావించారు. శ్రీనివాస్ ఆటోమొబైల్ వ్యర్థాల నుంచి అద్భుతాలను సృష్టించారన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి సేకరించిన ఇనుప ముక్కలు, ఇతర వస్తువులతో విగ్రహాలను రూపొందించారని చెప్పారు. అలాంటి విగ్రహాలను అధికారులు పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పారని, వేలాదిమందిని అవి ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్ వ్యర్థాలను ఇలా రీసైక్లింగ్ చేయడం గొప్ప విషయమని ప్ర‌ధాని మెచ్చుకున్నారు. పర్యావరణ పరిరక్ష‌ణ కోసం తమిళనాడుకు చెందిన బస్ కండక్టర్ మారిముత్త యోగనాథన్ చేస్తున్న‌ కృషిని కూడా ప్ర‌ధాని మోదీ కొనియాడారు. యోగ‌నాథ‌న్ త‌న బ‌స్సులో వ‌చ్చే ప్రతి ప్రయాణికుడికి టికెట్‌తో పాటు మొక్కను అందిస్తున్నార‌ని చెప్పారు. ఆయ‌న‌ చర్యలు తోటి వారిలో స్ఫూర్తి నింపుతున్నాయ‌ని చెప్పారు. వివిధ రంగాల్లో సామాజిక కార్య‌క‌ర్తలు చేస్తున్న కృషిని ప్ర‌ధాని మెచ్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here