యాస్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌ధాని  ఏరియ‌ల్ స‌ర్వే

0
80
Spread the love

యాస్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌ధాని  ఏరియ‌ల్ స‌ర్వే

భువ‌నేశ్వ‌ర్‌ మే 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: యాస్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. ఈ మ‌ధ్యాహ్నం ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు చేరుకున్న ప్ర‌ధాని.. ఆ రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌తో తుఫాన్ ప‌రిస్థితిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం కేంద్రమంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో క‌లిసి హెలిక్యాప్ట‌ర్‌లో ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్లోని తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియల్ స‌ర్వే నిర్వ‌హించారు.అనంత‌రం ప్ర‌ధాని మోదీ ప‌శ్చిమబెంగాల్లో తుఫాన్ ప‌రిస్థితిపై అక్క‌డి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించ‌నున్నారు. ఈ స‌మావేశానికి బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి కూడా హాజ‌రు కావాల్సి ఉండ‌గా.. కేంద్రం బెంగాల్ బీజేపీ నేత‌ల‌ను కూడా స‌మావేశానికి ఆహ్వ‌నించ‌డాన్ని నిర‌సిస్తూ ఆమె హాజ‌రుకాబోన‌ని తెగేసి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here