కొవిడ్-పై  పోరాటం ప్ర‌తి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్ర‌ధాని మోదీ

0
75
Spread the love

కొవిడ్-పై  పోరాటం ప్ర‌తి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ మే 18 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కొవిడ్-19పై మ‌న పోరాటం ప్ర‌తి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాల‌ని, గ‌త ఏడాది కాలంగా జ‌రిగిన ప్ర‌తి స‌మావేశంలో తాను ఈ విష‌యాన్ని చెబుతూ వ‌స్తున్నాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాపై పోరులో మీరంతా కీల‌కపాత్ర పోషిస్తున్నార‌ని, ఈ పోరాటంలో మీరు ఫీల్డ్ క‌మాండ‌ర్స్ అని అధికారుల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.గ‌త ఏడాది మ‌నం వ్య‌వ‌సాయ రంగంపై నిషేధం విధించలేద‌ని, అయినా గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు పంట పొలాల్లో సామాజిక దూరం పాటించిన తీరు త‌న‌ను విస్మ‌యానికి గురించేసింద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. అది గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల గొప్ప‌త‌న‌మ‌ని కొనియాడారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో లోకల్ కంటైన్‌మెంట్ జోన్‌లు, వేగంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జ‌లకు స‌రైన, సంపూర్ణ స‌మాచారం ఇవ్వ‌డం అనేవి మ‌న ప్రధాన ఆయుధాల‌ని ప్ర‌ధాని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here