భారత దేశ శాస్త్రవేత్తలను ప్రశంసించిన  ప్రధాని నరేంద్ర మోదీ 

0
79
Spread the love

భారత దేశ శాస్త్రవేత్తలను ప్రశంసించిన  ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ జూన్ 4 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించినందుకు భారత దేశ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కేవలం ఓ ఏడాదిలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచడంతోపాటు దీంతో పోరాడటానికి ఇతర చర్యలను బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో శుక్రవారం మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. గడచిన శతాబ్దంలో విదేశాల్లో సాధించిన అభివృద్ధిని మన దేశంలో సాధించడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చేదని చెప్పారు. కానీ నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో భుజం భుజం కలిపి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విదేశీ, స్వదేశీ శాస్త్రవేత్తలు ఒకే వేగంతో పని చేస్తున్నారన్నారు. ప్రపంచం ఓ శతాబ్దంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంటోందని, కేవలం ఓ ఏడాదిలోనే వ్యాక్సిన్లను అభివృద్ధిపరచడం బహుశా మునుపెన్నడూ లేదని చెప్పారు. స్వయం సమృద్ధ భారత దేశం, బలమైన భారత దేశం కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 సంక్షోభం వేగం తగ్గి ఉండవచ్చు కానీ, మన దృఢ నిశ్చయం సుస్థిరంగా ఉందని తెలిపారు. అనేక రంగాల్లో భారత దేశం స్వయం సమృద్ధత సాధించాలని కోరుకుంటోందన్నారు. వ్యవసాయ రంగం నుంచి ఖగోళం వరకు, విపత్తు నిర్వహణ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ వరకు, వ్యాక్సిన్ల నుంచి వర్చువల్ రియాలిటీ వరకు బయో టెక్నాలజీ నుంచి బ్యాటరీ టెక్నాలజీ వరకు భారత దేశం స్వయం సమృద్ధి సాధించాలనుకుంటోందని చెప్పారు. సుస్థిర అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచానికి ఓ మార్గాన్ని భారత దేశం చూపుతోందన్నారు. ఇతర దేశాలు సాఫ్ట్‌వేర్, శాటిలైట్ డెవలప్‌మెంట్ రంగాల్లో ప్రగతి సాధించడంలో భారత దేశం ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here