ఆయుధాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జాజీవితంలో క‌లిసిపొండి:ప్రదాని మోదీ

0
103
Spread the love

ఆయుధాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జాజీవితంలో క‌లిసిపొండి:ప్రదాని మోదీ


అస్సాం ఏప్రిల్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : ప్ర‌ధాని మోదీ ఇవాళ అస్సాంలో ప్ర‌చారంలో పాల్గొన్నారు. త‌ముల్‌పుర్‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. హింసా మార్గంలో ప‌య‌నిస్తున్న మిలిటెంట్లు. ఆయుధాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జాజీవితంలో క‌లిసి పోవాల‌ని మోదీ కోరారు. శాంతియుత ఆత్మ‌నిర్భ‌ర్ అస్సాంను నిర్మించేందుకు క‌లిసి రావాల‌న్నారు. త‌ల్లులు, సోద‌రీమ‌ణుల‌కు హామీ ఇస్తున్నాని, మీ పిల్ల‌లు ఆయుధాలు ప‌ట్టుకోరు అని, వాళ్లు త‌మ జీవితాల‌ను అడ‌వుల్లో గ‌డ‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎటువంటి బుల్లెట్ల‌కు నేల‌రాల‌వ‌ద్దు అని ఆయ‌న అన్నారు. అస్సాం ఐడెంటిటీని అవమానించేవారిని, హింస‌ను ప్రోత్స‌హించేవారిని అస్సామీ ప్ర‌జ‌లు బ‌హిష్క‌రిస్తార‌ని కాంగ్రెస్ కూట‌మిని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌త అయిదేళ్ల‌లో బూపెన్ హ‌జారికా సేతు, బోగిబీల్ బ్రిడ‌జ్‌ల‌ను నిర్మించామ‌ని, మ‌రో అర‌డ‌జ‌న బ్రిడ్జ్‌లు నిర్మాణంలో ఉన్నాయ‌ని, మేం ఏదైనా స్కీమ్‌ను రూపొందిస్తే, దాని ఫ‌లితాలు అంద‌రికీ అందేలా చూస్తామ‌ని, స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాశ్ త‌మ నినాద‌మ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here