ప్రధానమంత్రి పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన
నేడు ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హుస్సైనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థలానికి హెలికాప్టర్లో వెళ్ళేందుకు బఠిండా విచ్చేశారు. వర్షం, దృశ్యమానత సరిగా లేకపోవడంతో (పూర్ విజిబిలిటీ) కారణంగా, ప్రధానమంత్రి వాతావరణం మెరుగవుతుందనే భావనతో 20 నిమిషాల పాటు వేచి ఉన్నారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో, జాతీయ అమరవీరుల స్మారక స్థలానికి రెండు గంటలకు పైగా ప్రయాణించవలసి ఉన్నా, రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాలనే నిర్ణయం జరిగింది. పంజాబ్ పోలీస్ డిజిపి తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని ఖరారు చేయడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ప్రారంభించారు. హుస్సైన్వాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థలానికి దాదాపు 30 కిమీలు ఉన్న ఫ్లైఓవర్ వద్దకు ప్రధాన మంత్రి కాన్వాయ్ చేరుకునేసరికి, ఆ రహదారిని కొందరు నిరసనకారులు దిగ్బంధనం చేసినట్టు గుర్తించారు. ప్రధానమంత్రి దాదాపు 15-20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయారు. ఇది ప్రధానమంత్రి భద్రతలో భారీ అతిక్రమణ. ప్రధానమంత్రి ప్రయాణ ప్రణాళికను,షెడ్యూలును ముందస్తుగానే పంజాబ్ ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది.
కార్యసరళి ప్రకారం, వారు వసతికి, భద్రతకు తగిన ఏర్పాట్లు చేయడమే కాక అత్యవసర ప్రణాళికను సిద్ధం చేయాలి. అత్యవసర ప్రణాళిక దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం రహదారి పై ఎటువంటి కదలికలు, సంచారం లేకుండా చూసేందుకు అదనపు భద్రతా దళాలను మోహరించవలసి ఉంటుంది. కానీ, వారిని మోహరించనట్టు స్పష్టంగా తెలుస్తోంది. భద్రతా అతిక్రమణ అనంతరం, తిరిగి బఠిండా విమానాశ్రయానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. ఈ భద్రతా లోపాన్ని తీవ్రమైన దానిగా పరిగణించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లోపానికి బాధ్యత వహిస్తూ, ఇందుకు బాధ్యలైనవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా హోం మంత్రిత్వ శాఖ కోరింది.