విద్య రంగ సముదాయాన్ని ఉద్దేశించి రేపు ప్రసంగించనున్న ప్రధాని

0
115
Spread the love

విద్య రంగ సముదాయాన్ని ఉద్దేశించి రేపు ప్రసంగించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జాతీయ విద్య విధానం- 2020’ లో భాగం అయిన సంస్కరణల కు ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భాని కి గుర్తు గా 2021 వ సంవత్సరం జులై నెల 29 న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశం లోని విద్యార్థుల ను, గురువుల ను, విద్య, నైపుణ్య వికాసం సంబంధి క్షేత్రానికి చెందిన విధాన రూపకర్తల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విద్య రంగం లో అనేక కార్యక్రమాల ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

విద్యార్థుల కు ఉన్నత విద్య లో ప్రవేశం, నిష్క్రమణ ల పరంగా బహుళ అయిచ్ఛికాల ను అందిచే ఎకేడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ను ప్రధాన మంత్రి కార్యక్రమం లో ప్రారంభిస్తారు. దీని తో పాటు, ప్రాంతీయ భాషల లో ఒకటో సంవత్సరం ఇంజినీరింగ్ కార్యక్రమాలను, ఉన్నత విద్య అంతర్జాతీయకరణ కు సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాల ను కూడా ప్రధాన మంత్రి జారీ చేస్తారు.

ప్రధాన మంత్రి ప్రారంభించనున్న కార్యక్రమాలలో.. ‘విద్య ప్రవేశ్’ కూడా ఒకటి గా ఉంటుంది. ఇది గ్రేడ్ వన్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన మూడు నెలల నాటకాధారిత పాఠశాల సన్నాహక మాడ్యూల్; మాధ్యమిక స్థాయి లో ఒక విషయం గా భారతీయ సంజ్ఞా భాష; ఎన్ సిఇఆర్ టి రూపొందించిన ఉపాధ్యాయ శిక్షణ సంబంధిత ఏకీకృత‌ కార్య్రకమం- ఎన్ఐఎస్ హెచ్ టిహెచ్ఎ ‘నిశిత 2.0’; ఎస్ఎఎఫ్ఎఎల్- ‘సఫల్’ (స్ట్రక్చర్ డ్ అసెస్ మెంట్ ఫార్ ఆనలైజింగ్ లర్నింగ్ లెవెల్స్) ; సిబిఎస్ఇ పాఠశాలల్లో 3వ, 5వ, 8వ గ్రేడు ల కోసం ఉద్దేశించినటువంటి యోగ్యత ఆధారితమైన మూల్యాంకన స్వరూపం లతో పాటు ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ కు అంకితం అయ్యే ఒక వెబ్ సైట్.. లు కూడా ఉన్నాయి.

ఇంకా, నేశనల్ డిజిటల్ ఎడ్యుకేశన్ ఆర్కిటెక్చర్ ఎన్ డిఇఎఆర్, నేశనల్ ఎడ్యుకేశనల్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఇటిఎఫ్) లను కూడా ఇదే కార్యక్రమం లో ప్రారంభించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమాలు జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) 2020 లక్ష్యాల ను సాధించే దిశ లో ఒక ముఖ్యమైన అడుగు గా ఉండబోతున్నాయి. విద్య రంగం మరింత చైతన్య భరితం గా, మరింత మంది కి అందుబాటు లో ఉండేటట్లు గా ఈ కార్యక్రమాలు తోడ్పడనున్నాయి.

ఒక ‘ఆత్మ నిర్భర్ భారత్’ ను ఆవిష్కరించడం కోసం బలమైన పునాదుల ను నిర్మించడానికి జ్ఞానార్జన మౌలిక స్వరూపం లో మార్పుల ను తీసుకు రావడం కోసం విద్య ను సమగ్రమైంది గా తీర్చిదిద్దడానికి మార్గదర్శక విధానంగా ఎన్ఇపి- 2020 ఉంది. ఇది 21 వ శతాబ్ది లో తొలి విద్య విధానం గా కూడాను ఉంది. అంతేకాదు, 34 సంవత్సరాల నాటి పాత నేశనల్ పాలిసి ఆన్ ఎడ్యుకేశన్ (ఎన్ పిఇ) స్థానం లో దీని ని అమలు పరుస్తున్నారు. లభ్యత, సమానత, నాణ్యత, తక్కువ ఖర్చు తో కూడిన, జవాబుదారీతనం కలిగిన అనే పునాదుల మీద రూపు ను దిద్దుకొన్నటువంటి ఈ విధానాన్ని సుస్థిర అభివృద్ధి కోసం 2030 కార్యాచరణ ప్రణాళిక తో సంధానించడం జరిగింది. ఇది భారతదేశాన్ని ఒక జాగృతిభరిత జ్ఞాన ప్రధానమైనటువంటి సమాజం గాను, ప్రపంచం లో ఒక మహా జ్ఞాన శక్తి గాను దిద్ది తీర్చడానికి ఉద్దేశించినటువంటి విధానం గా ఉంది. పాఠశాల విద్య ను, కళాశాల విద్య ను మరింత సంపూర్ణమైందిగాను, మార్పు చేర్పుల కు అవకాశం ఉండేదిగాను, బహుళ విభాగాలు కలిగిందిగాను, 21వ శతాబ్దం అవసరాల కు సరిపోయేదిగాను మలచి, ప్రతి ఒక్క విద్యార్థిని లో, ప్రతి ఒక్క విద్యార్థి లో దాగివుండే విశిష్ట సామర్థ్యాల ను వెలికి తీసుకు రావడమే ధ్యేయం గా దీనికి రూపకల్పన చేయడం జరిగింది.

ఈ సందర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here