రేపు కీల‌కోప‌న్యాసం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

0
86
Spread the love
ఈ నెల 16న వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీల‌కోప‌న్యాసం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 16న సాయంత్రం 4 గంట‌ల వేళ లో వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీల‌కోప‌న్యాసం ఇవ్వ‌నున్నారు.  వివా టెక్ 2021 కార్య‌క్ర‌మం లో కీల‌కోప‌న్యాసం ఇవ్వ‌డానికి ప్ర‌ధాన మంత్రి ని గౌర‌వ అతిథి గా ఆహ్వానించ‌డ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొనే ఇత‌ర ప్రముఖ వ‌క్త‌ల లో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్, స్పెయిన్ ప్ర‌ధాని శ్రీ పెడ్రో సాంచెజ్ ల‌తో పాటు యూరోప్ లోని వివిధ దేశాల కు చెందిన మంత్రులు/ఎంపీ లు కూడా ఉన్నారు.  ఏపల్ సిఇఒ శ్రీ టిమ్ కుక్‌, ఫేస్ బుక్ చైర్‌మ‌న్‌ మ‌రియు సిఇఒ శ్రీ మార్క్ జకర్ బర్గ్,  మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంటు శ్రీ బ్రాడ్ స్మిత్ త‌దిత‌ర కార్పొరేట్ నేత‌ లు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొననున్నారు.

వివాటెక్ అనేది యూరోప్ లో జరిగే అతి పెద్ద‌దైన డిజిట‌ల్, స్టార్ట్ అప్ కార్య‌క్ర‌మాల లో ఒక‌టి.  2016వ సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తి ఏటా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్యారిస్ లో జ‌రుపుతున్నారు.  ఈ కార్యక్రమాన్ని  ఫ్రాన్స్ కు చెందిన‌ ప్ర‌ముఖ మీడియా గ్రూపు లెస్ ఇకోస్ ప్ర‌ముఖ అడ్వ‌ర్‌టైజింగ్‌, మార్కెటింగ్ రంగం లోని ప్రముఖ సంస్థ అయిన ప‌బ్లిసిస్ గ్రూప్ తో క‌ల‌సి  నిర్వ‌హిస్తోంది.  ఈ కార్యక్రమం సాంకేతిక విజ్ఞాన రంగం లో, స్టార్ట్ అప్ ఇకో సిస్ట‌మ్ లో భాగం పంచుకొంటున్న సంస్థ‌ల ను ఒకే చోటు లో స‌మావేశ‌ప‌రుస్తోంది.  ప్ర‌ద‌ర్శ‌న లు, పుర‌స్కారాలు, బృంద చ‌ర్చ‌లు, స్టార్ట్ అప్ పోటీ లు ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఉంటాయి.  వివాటెక్ అయిదో సంచిక ను ఈ సంవ‌త్స‌రం లో జూన్ నెల 16వ తేదీ నుంచి అదే నెల 19వ తేదీ మ‌ధ్య కాలం లో నిర్వ‌హించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here