25వ జాతీయ యువజనోత్సవాన్ని జనవరి 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి 

0
103
Spread the love


యువతీయువకుల నాయకత్వంలో అభివృద్ధి మరియు సరికొత్త గా తలెత్తుతున్న అంశాల ను, సమస్యలను పరిష్కరించడం కోసం వారి లో ప్రేరణ ను కల్పించడం వంటి విషయాల పై చర్చ ఈ ఉత్సవం లోభాగం గా ఉంటాయి

ఒలింపిక్ క్రీడాకారులు, దివ్యాంగజనుల ఒలింపిక్ క్రీడోత్సవాల లోపాలుపంచునకొన్న వారితో బహిరంగ చర్చలు కూడా నిర్వహిస్తారు

‘‘మేరే సప్ నోంకా భారత్’’ మరియు ‘‘అనుసంగ్ హీరోజ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్ మెంట్’’ ల పై ఎంపిక అయిన వ్యాసాల ను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు

ఎమ్ఎస్ఎమ్ఇ టెక్నాలజీ సెంటరు ను, ఓపన్ ఎయర్ థియేటర్ తో కూడిన సభాభవనం ‘పెరున్ థలైవర్ కామరాజర్ మణిమండపమ్’ ను కూడాప్రారంభించనున్న ప్రధాన మంత్రి  

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ జాతీయ యువజనోత్సవాన్ని 2022వ సంవత్సరం జనవరి 12వ తేదీన పుదుచ్చేరీ లో ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భం లో ఆ దినాన్ని జాతీయ యువజన దినం గా పాటించడం జరుగుతోంది.

భారతదేశం లో యువతీ యువకుల మనస్సు కు దిశ ను ఇవ్వడం, వారి ని దేశ నిర్మాణం కోసం ఒక శక్తి వలె ఏకం చేయడం ఈ ఉత్సవం ఉద్దేశం గా ఉంది. ఇది సామాజిక సమన్వయాని కి, బౌద్ధిక, సాంస్కృతిక ఏకత తాలూకు అన్నిటికంటే పెద్దవైన ప్రయాసల లో ఒకటి గా ఉంది. దీని లక్ష్యం ఏమిటి అంటే భారతదేశం లోని వివిధత నిండిన సంస్కృతుల ను ఒక చోటు కు చేర్చాలి, వాటి ని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ తాలూకు ఐక్యత సూత్రం గా కూర్చాలి అనేదే.

ఈ సంవత్సరం లో కోవిడ్ తాలూకు వర్తమాన పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని ఈ ఉత్సవాన్ని 2022 జనవరి 12వ, 13వ తేదీల లో వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమం అనంతరం జాతీయ యువజన శిఖర సమ్మేళనం జరుగుతుంది. ఆ శిఖర సమ్మేళనం లో నాలుగు విశేష ఇతివృత్తాల పైన బృంద చర్చాగోష్ఠి ఉంటుంది. యువత నాయకత్వం లో అభివృద్ధి , సరికొత్త అంశాలను, సవాళ్ళ ను పరిష్కరించడం కోసం యువజనుల ను ప్రేరితుల ను చేయడానికి సంబంధించినే ప్రయాసల క్రమం లో పర్యావరణం, జలవాయు సంబంధి అంశాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) పై ఆధారపడ్డ వృద్ధి; సాంకేతిక విజ్ఞానం, నవ పారిశ్రామికత్వం, ఇంకా నూతన ఆవిష్కరణలు, స్వదేశీ మరియు ప్రాచీన జ్ఞానం, దేశ చరిత్ర, దేశ నిర్మాణం, స్థానీయ మరియు ప్రాంతీయ వాణిజ్య సంస్థల ను ప్రోత్సహించడం వంటివాటిని చేర్చడం జరిగింది. ఈ ఉత్సవం లో పాలుపంచుకొనే వారి కి పుదుచ్చేరీ, ఆరోవిలే, సాంకేతిక విజ్ఞ‌ానం ద్వారా పట్టణాల లో జీవనాన్ని ఉన్నతీకరించడం, స్వదేశీ ఆటలు ఇంకా జానపద నృత్యాలు వగైరా విషయాల పై ముందు గా రికార్డు చేసిన వీడియో కేప్స్యూల్ ను చూపించడం జరుగుతుంది. ఒలింపిక్ క్రీడోత్సవాల లో భాగం పంచుకొన్న క్రీడాకారుల తో, పారాలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారుల తో బహిరంగ చర్చ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ తరువాత సాయంకాలం లో ప్రత్యక్ష కళా ప్రదర్శన ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం పూట వర్చువల్ పద్ధతి లో యోగ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి ‘‘మేరే సప్ నోంకా భారత్’’ (నా కలల భారతదేశం), ఇంకా ‘‘అనుసంగ్ హీరోజ్ ఆఫ్ ఇండియన్ మూవ్ మెంట్’’ (భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం లో వెలుగు లోకి రానటువంటి మహానాయకులు) అంశాల పై ఎంపికైన కొన్ని వ్యాసాల ను ఆవిష్కరిస్తారు. ఈ వ్యాసాల ను లక్ష కు పైగా యువతీ యువకులు ఈ రెండు విషయాల మీద వ్యాసాలను రాసి పంపించగా, వాటి లోనుంచి కొన్నిటిని ఎంపిక చేయడమైంది.

ప్రధాన మంత్రి సూక్ష్మ, లఘు, మధ్యమ వాణిజ్య సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ఒక టెక్నాలజీ సెంటర్ ను కూడా ప్రారంభిస్తారు. దీనిని సుమారు 122 కోట్ల రూపాయల పెట్టుబడి తో పుదుచ్చేరీ లో స్థాపించడమైంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ ఎండ్ మేన్యుఫాక్చరింగ్ (ఇఎస్ డిఎమ్) రంగం పై ప్రత్యేక దృష్టి ని సారిస్తూ ఉండే ఈ టెక్నాలజీ సెంటర్ లో అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జత పరచడం జరుగుతుంది. ఈ సెంటర్ యువజనులను నిపుణులు గా తీర్చిదిద్దడం లో తోడ్పాటు ను అందిస్తుంది. అంతే కాక ప్రతి సంవత్సరం లో దాదాపు గా 6400 మంది శిక్షణార్థుల కు శిక్షణ ను అందించగల సామర్థ్యం దీనికి ఉంటుంది.

పుదుచ్చేరీ ప్రభుత్వం ఇంచుమించు 23 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించిన పెరున్ థలైవర్ కామరాజర్ మణిమండపమ్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది ఓపన్ ఎయర్ థియేటర్ హంగు కలిగి ఉన్న ఒక సభాభవనం. దీని ని ప్రధానం గా విద్య సంబంధి ప్రయోజనాల కోసం వినియోగించడం జరుగుతుంది. దీని లో 1000 మంది కి పైగా కూర్చనొనేందుకు అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here