బెంగళూరు లో రూ. 27వేల‌ కోట్ల పథకాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని

0
38
Spread the love

బెంగళూరు లో రూ. 27వేల‌ కోట్ల పథకాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెంగళూరు లో అనేక రైలు మరియు రోడ్డు మౌలిక సదుపాయాల పథకాల కు ప్రారంభోత్సవంతో పాటు, వాటి లో కొన్ని పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ 27,000 కోట్ల రూపాయల కు పైగానే ఉంటుంది. అంతక్రితం ప్రధాన మంత్రి ఐఐఎస్ సి బెంగళూరు లో సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను ప్రారంభించడంతో పాటు, బాగ్ చీ పార్థసారథి మల్టి స్పెశాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. ఆయన డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (బిఎఎస్ఇ) యూనివర్శిటీ కొత్త కేంపస్ ను కూడా ప్రారంభించారు. అదే కేంపస్ లో భారత రత్న డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ యొక్క విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఆయన 150 ఐటిఐ లను టెక్నాలజీ హబ్స్ గా ఉన్నతీకరించగా, వాటిని కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు.

ఈ సందర్భం లో కర్నాటక గవర్నర్ శ్రీ థావ‌ర్ చంద్ గెహ్లాట్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ తదితరులు పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కర్నాటక లో 5 జాతీయ హైవే పథకాల కు, 7 రైల్ వే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా, ఈ రోజు న కొంకణ్ రైల్ వే తాలూకు 100 శాతం విద్యుదీకరణ కూడా చెప్పుకోదగినటువంటి ఒక మైలురాయి అని పేర్కొనాలి. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా కర్నాటక లో యువత కు కొత్త అవకాశాల ను అందించడం తో పాటు, మధ్య తరగతి కి, రైతుల కు, శ్రమికుల కు, నవపారిశ్రామికవేత్తల కు సరికొత్త సదుపాయాల ను అందజేస్తాయి అన్నారు.

 

దేశం లో లక్షలాది యువతీ యువకుల కు బెంగళూరు ఒక కలల నగరం గా ఉంది. ఈ నగరం ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ భావన ను ప్రతిబింబిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బెంగళూరు ను అభివృద్ధి చేయడం అంటే, లక్షలాది స్వప్నాల ను పెంచి పోషించడమని చెప్పాలి. ఈ కారణం గానే గడచిన 8 సంవత్సరాల లో బెంగళూరు సామర్థ్యాల ను పెంపొందింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవిరామం గా కృషి చేస్తోంది’’ అని ఆయన అన్నారు.

బెంగళూరు ను ట్రాఫిక్ జామ్ ల బారి నుంచి విముక్తి ప్రసాదించడం కోసం రైలు, రోడ్డు, మెట్రో, అండర్ పాస్, ఫ్లయ్ ఓవర్.. ల వంటి మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయడం వంటి ప్రతి సాధ్యమైన ప్రయత్నాలన్నింటినీ ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వం చేస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. బెంగళూరు లోని శివారు ప్రాంతాల ను ఉత్తమమైన సంధానం తో జోడించడాని కి తన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా ఆయన అన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలు గా ఈ విధమైన చర్యల ను గురించిన మాటలు అదే పనిగా సాగుతూ వచ్చాయి, మరి ఇప్పుడు ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వం తో ఈ ప్రాజెక్టుల ను ప్రస్తుత హయాం లో పూర్తి చేసేందుకు అవకాశాన్ని ఇచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుల ను సకాలం లో చెంతకు చేరుస్తాము అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గడచిన 40 సంవత్సరాల లో పెండింగు పడ్డ ప్రజల స్వప్నాల ను రాబోయే 40 నెలల్లో సాకారం చేయడాని కి తాను కఠోరం గా శ్రమిస్తానని ఆయన చెప్పారు.

బెంగళూరు శివారు రైలు పథకం ద్వారా సంధానం బెంగళూరు నగరాన్ని దాని శివారుల తో శాటిలైట్ టౌన్ శిప్స్ తోను జత పరుస్తుంది. మరి తత్ఫలితం గా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు నగరం యొక్క రద్దీని తగ్గిస్తుంది అని ఆయన అన్నారు. గత 8 సంవత్సరాల లో ప్రభుత్వం రైలు సంధానాన్ని సంపూర్ణం గా మార్చివేసే పని లో నిమగ్నం అయింది అని ప్రధాన మంత్రి వివరించారు. భారతీయ రైల్ వే లు వేగవంతం గా, మరింత స్వచ్ఛం గా మారడం తో పాటు, ఆధునికం గా , సురక్షితం గా పౌరుల కు అనుకూలం గా రూపుదిద్దుకొంటున్నాయి అని ఆయన తెలిపారు. ‘‘ఇదివరకు ఆలోచించడాని కి కూడా కష్టం గా ఉన్న దేశం లోని కొన్ని ప్రాంతాల కు మేము రైలు ను తీసుకు పోయాము. ఒకప్పుడు విమానాశ్రయాల లో మరియు విమాన ప్రయాణం లో మాత్రమే లభించినటువంటి సదుపాయాల ను ప్రస్తుతం ప్రయాణికుల కు అందించడానికి ఇండియన్ రైల్ వేస్ ప్రయత్నిస్తోంది. బెంగళూరు లో ఆధునిక రైల్ వే స్టేశన్ కు భారత రత్న సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య పేరును పెట్టడం అనేది సైతం దీనికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఏకీకృత బహుళవిధ సంధానం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనే దానికి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒక కొత్త ఉత్తేజం లభిస్తోంది అని ఆయన ప్రస్తావించారు. త్వరలో ఏర్పాటు కాబోయే మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఈ దృష్టి కోణం లో ఒక భాగం గా ఉంది అని ఆయన అన్నారు. గతిశక్తి యొక్క స్ఫూర్తి తో చేపట్టేటటువంటి ఆ తరహా ప్రాజెక్టులు యువత కు ఉపాధిని కల్పిస్తాయని, ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ను కూడా పటిష్టం చేస్తాయని ఆయన అన్నారు.

బెంగళూరు సాఫల్య గాథ 21వ శతాబ్దాని కి చెందిన భారతదేశాని కి ‘ఆత్మనిర్భర్ భారత్’ గా అయ్యేందుకు ప్రేరణ ను ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం గనుక సదుపాయాల ను సమకూర్చి, పౌరుల జీవితాల లో జోక్యాన్ని కనీస స్థాయి కి తగ్గించిన పక్షం లో భారతదేశ యువత ఏమి చేయగలుగుతుంది అనేదాన్ని బెంగళూరు చాటి చెప్పింది. బెంగళూరు దేశ యువతీయువకుల కలల నగరం గా ఉంది. మరి దీని వెనుక నవపారిశ్రామికత్వం, నూతన ఆవిష్కరణలు, సార్వజనిక రంగాన్ని, అలాగే ప్రైవేటు రంగాన్ని సరి అయిన విధం గా వినియోగించుకోవడం ఈ అంశాలు అన్నీ ఉన్నాయి అని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రైవేటు వ్యాపార సంస్థల భావన పట్ల అంతగా గౌరవం లేనటువంటి వారికి బెంగళూరు ఒక పాఠం గా నిలచింది అని ఆయన అన్నారు. 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం ఎలాంటిది అంటే, అది సంపద ను సృష్టించేవారి, ఉద్యోగాల ను అందించేవారి మరియు నూతన ఆవిష్కర్తల కు చెందిన భారతదేశం అని ఆయన అభివర్ణించారు. ప్రపంచం లో అత్యంత యువ దేశం గా ఇది భారతదేశం యొక్క సంపద, ఇంకా శక్తి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.


ఎమ్ఎస్ఎమ్ఇ కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఎస్ఎమ్ఇ యొక్క నిర్వచనం లో మార్పు చోటు చేసుకోవడం తో వాటి వృద్ధి కి కొత్త దారులు బార్లా తెరచుకొన్నాయి అని ప్రధానమంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ భావన పట్ల విశ్వాసాని కి ఒక సూచిక గా భారతదేశం 200 కోట్ల రూపాయల వరకు నిల్వ కలిగిన కాంట్రాక్టుల లో విదేశీ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల ను 25 శాతం స్థాయి వరకు కొనుగోళ్ళ ను ఎమ్ఎస్ఎమ్ఇ నుంచి జరపాలి అని ఆదేశించడమైంది అని ఆయన వివరించారు. జిఇఎమ్ పోర్టల్, ఎమ్ఎస్ఎమ్ఇ విభాగాని కి ఒక గొప్ప సంధాన కర్త గా నిరూపణ అవుతోంది అని ఆయన అన్నారు.


స్టార్ట్-అప్ రంగం లో ప్రధానమైన విజయాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇదివరకటి దశాబ్దల లో బిలియన్ డాలర్ కంపెనీలు ఏ విధం గా ఏర్పడ్డాయి అనేది వేళ్ళపై లెక్కపెట్టవచ్చును అన్నారు. అయితే, ఒక 8 సంవత్సరాల లో బిలియన్ డాలర్ కంపెనీల ను 100 కు పైగా సృష్టించడం జరిగింది. అంతేకాకుండా, ప్రతి నెలా కొత్త కంపెనీల ను ఈ జాబితా కు చేర్చడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మొదటి 10,000 స్టార్ట్-అప్ లు 2014వ సంవత్సరం అనంతరం 800 రోజుల వ్యవధి లో ఏర్పాటు కాగా, ప్రస్తుతం అదే సంఖ్య లో స్టార్ట్-అప్ లు 200 రోజుల కన్నా తక్కువ వ్యవధి లో జత అయ్యాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. గత 8 సంవత్సరాల లో ఏర్పాటైన యూనికార్న్ యొక్క విలువ దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది అని ఆయన అన్నారు.


ఒక సంస్థ ప్రభుత్వాని కి చెందినదా, లేక ప్రైవేటు రంగం లో ఉన్నదా అనే విషయం లో చూసినట్లయితే ఆ రెండూ కూడా దేశం యొక్క ఆస్తులే అని తాను స్పష్టం గా నమ్ముతానని ప్రధాన మంత్రి అన్నారు. అంటే ప్రతి ఒక్కరికీ సమానమైన ఆట ను ఆడే అవకాశాల ను అందించాలి అని ఆయన పేర్కొన్నారు. దేశం లో యువతీ యువకులు వారి యొక్క దృష్టి కోణాన్ని నిగ్గు తేల్చుకోవాలని, వారి ఆలోచనల ను ప్రపంచ శ్రేణి కేంద్రాల లో నిరూపించుకోవాలని ఆయన ఆహ్వానించారు. యువత కు ప్రభుత్వం వేదిక ను కల్పిస్తోంది అని ఆయన చెప్పారు. ప్రభుత్వ కంపెనీలు కూడా సమానమైన అవకాశాలు లభించే మైదానం లో పోటీ పడతాయి అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.


ప్రాజెక్టుల వివరాలు:


బెంగళూరు సబర్బన్ ప్రాజెక్టు (బిఎస్ఆర్ పి) బెంగళూరు నగరాన్ని ఆ నగర శివారుల తో మరియు శాటిలైట్ టౌన్ శిప్ లతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టు కు నిర్మాణ వ్యయం 15,700 కోట్ల రూపాయల కు పైగానే; దీనిలో భాగం గా 4 కారిడార్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాగా, మొత్తం రూట్ నిడివి 148 కిలో మీటర్ లకు పైగా ఉంటుంది. ప్రధాన మంత్రి సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం అయ్యే బెంగళూరు కంటోన్మెంట్ పునరభివృద్ధి పథకాని కి, 375 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే యశ్వంత్ పుర్ జంక్షన్ రైల్ వే స్టేశన్ పునరభివృద్ధి పథకాని కి శంకుస్థాపనలు చేశారు.


ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి భారతదేశం లో మొట్టమొదటి ఎయర్ కండిశన్ సదుపాయం కలిగిన రైల్ వే స్టేశన్.. సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేశన్ ను, బయ్యప్పనహళ్ళి లో ఏర్పాటు కాగా, ఆ రైల్ వే స్టేశన్ ను దేశ ప్రజల కు అంకితం చేశారు. సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేశన్ ను ఒక ఆధునిక విమానాశ్రయం తోవ లో మొత్తం ఇంచుమించు 315 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. కొంకణ్ రైలు మార్గం లో మహారాష్ట్ర లోని రోహా నుంచి కర్నాటక లోని తోకూర్ వరకు (దాదాపు గా 740 కిలో మీటర్ ల మేర) 100 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయిన రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ మార్గాని కి ప్రారంభ సూచకం గా ఉడిపి, మడగావ్, మరియు రత్నగిరి ల నుంచి సాగే ఎలక్ట్రిక్ ట్రైన్స్ కు ఆయన జెండా ను చూపారు. 1280 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో కొంకణ్ రైల్ వే లైను కు విద్యుదీకరణ జరిగింది. రెండు రైల్ వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులు.. అర్సికెరె నుంచి తుమకురు (సుమారు 96 కిమీ) మరియు ఎలహంక నుంచి పెనుకొండ (దాదాపుగా 120 కిమీ) లను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా మార్గాల లో ప్రయాణికుల రైళ్ళ కు మరియు మెము (ఎమ్ఇఎమ్ యు) సర్వీసు కు ఆయన ప్రారంభ సూచక జెండా ను చూపారు. ఈ రెండు రైలు మార్గాల డబ్లింగ్ పథకాల కు వరుస గా 750 కోట్ల రూపాయల కు పైచిలుకు మరియు 1100 కోట్ల రూపాయల వ్యయం అయింది.

కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు తాలూకు రెండు సెక్షన్ లకు కూడా శంకు స్థాపన చేశారు. 2280 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయం తో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు నగరాని కి వాహన రాకపోకల రద్దీని తగ్గించడం లో సహాయకారి కాగలదు. ప్రధాన మంత్రి మరికొన్ని రోడ్డు ప్రాజెక్టుల కు కూడా శంకుస్థాపన చేశారు. వాటిలో ఎన్ హెచ్-48 నీలమంగళ- తుమకూరు సెక్షను ను 6 దోవలు కలిగి ఉండేదిగా విస్తరించడం; ఎన్ హెచ్-73 లోని పుంజల్ కట్-చర్ మాడి సెక్షను విస్తరణ పనులు; ఎన్ హెచ్- 69 లో ఒక సెక్షను ను ఉన్నతీకరించడం వంటి భాగం గా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల కు అయ్యే మొత్తం వ్యయం దాదాపు గా 3150 కోట్ల రూపాయలు గా ఉంది. ప్రధాన మంత్రి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కు కూడా పునాది రాయిని వేశారు. ఈ పార్కు ను సుమారు 1800 కోట్ల రూపాయల వ్యయం తో బెంగళూరు నుంచి దాదాపు 40 కిమీ దూరం లో ఉన్న ముద్దలింగనహళ్ళి లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ లాజిస్టిక్స్ పార్క్ రవాణా, హ్యాండ్లింగ్ మరియు సెకండరీ ఫ్రైట్ వ్యయాల ను తగ్గించడం లో తోడ్పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here