విప‌త్క‌ర స‌మ‌యాల్లో అల‌సిపోమ‌ని నిరూపించిన కాశీ ప‌ట్ట‌ణం

0
34
Spread the love

వార‌ణాసి: ప్ర‌ధాని మోదీ ఇవాళ వార‌ణాసిలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ ఆయ‌న బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీలో మాట్లాడారు. క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోరాటాన్ని ప్ర‌ధాని మెచ్చుకున్నారు. అత్య‌ధిక సంఖ్య‌లో యూపీలో వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నార‌ని, ఇక్క‌డే అత్య‌ధిక సంఖ్య‌లో వ్యాక్సిన్లు ఇస్తున్నార‌ని మోదీ అన్నారు. విప‌త్క‌ర స‌మ‌యాల్లో ఆగిపోమ‌ని, అల‌సిపోమ‌ని కాశీ ప‌ట్ట‌ణం నిరూపించింద‌న్నారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి యావ‌త్ మాన‌వాళి ఇబ్బందులు ఎదుర్కుంటోంద‌ని, కాశీతో పాటు యూపీ రాష్ట్ర‌మంతా ప్ర‌మాద‌క‌ర వైర‌స్ మ్యుటేష‌న్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

పూర్వాంచ‌ల్‌లో కాశీ క్షేత్రం మెడిక‌ల్ హ‌బ్‌గా మారిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఒక‌ప్పుడు కాశీ ప్ర‌జ‌లు చికిత్స కోసం ఢిల్లీ లేదా ముంబై వెళ్లేవార‌ని, కానీ ఇప్పుడు ఇక్క‌డే అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు చెప్పారు. కాశీలో సుమారు 700 సీసీటీవీ కెమెరాల‌ను ఇన్‌స్టాల్ చేయ‌నున్నారు. ఘాట్ల స‌మాచారం కోసం ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని వ‌ల్ల టూరిజం పెరుగుతుంద‌న్నారు. డీజిల్ బోట్ల‌ను సీఎన్జీగా మార్చుతున్నామ‌న్నారు. వ్య‌వ‌సాయ మౌళిక‌సదుపాయాల‌ను బోల‌పేతం చేస్తున్నామ‌ని, దీంతో జాతీయ మండీ వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here