వీధి వ్యాపారులకు రూ. 56 కోట్ల సహాయం

0
53
Spread the love
*వీధి వ్యాపారులకు రూ. 56 కోట్ల సహాయం*
 
*హైదరాబాద్, మే 09:*    రోడ్డు పైన, ఇంటింటికీ తిరిగి అమ్ముకొని జీవించే చిరు వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో చిరు వ్యాపారులకు  కుటుంబ జీవనం కష్టతరంగా ఉండేది. దానిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి (పిఎం స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్బర్ నిధి)  సులభ పద్ధతి తో బ్యాంకు ల ద్వారా రుణాలు అందించారు.
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ కమ్యూనిటీ విభాగం ద్వారా చిరు వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేసిన పిదప రుణం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు లను పరిశీలించిన పిదప బ్యాంకు వారు అర్హత గల వారికి 10,000 రూపాయల రుణం అందిస్తారు. తీసుకున్న రుణాన్ని  12 వాయిదాల పద్ధతిలో 7 శాతం వడ్డీ తో  తిరిగి చెల్లించాలి.
 
ఆర్.బి.ఐ నిబంధనల మేరకు  తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాలి అయితే 7 శాతం ఎక్కువగా ఉన్న పక్షంలో అట్టి వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది
.
 జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి వరకు  81,415 చిరు వ్యాపారులు దరఖాస్తు చేసుకోగా  59,016 మందికి రూ. 64.80 కోట్లు మంజూరు అయ్యింది.అందులో రూ. 56  కోట్ల రూపాయల రుణాన్ని  51,779  మందికి  పంపిణీ చేశారు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వలన వివిధ స్థాయిలో  తిరస్కరించారు 
 
 మొదటి విడతలో 70,159 మంది దరఖాస్తు చేసుకోగా 53,148 దరఖాస్తు దారుల కోసం రూ. 53.11 కోట్ల రూపాయలు మంజూరు కాగా 47,189  మందికి  రూ. 46.88 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. మొదటి సారి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించగా రుణంగా తీసుకున్న రూ. 10 వేల రూపాయలు వడ్డీ తో వాయిదా పద్దతిలో చెల్లించే వారికి రెండో విడతలో 20 వేల రూపాయల ను తిరిగి రుణాలు పంపిణీ చేస్తారు.
 
రెండో విడతలో  రూ. 20 వేల రుణ మంజూరు కోసం ఇప్పటి వరకు  11,256  దరఖాస్తు లు రాగ 5,868 మందికి రూ.11.68 కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో  4,590  మందికి రూ. 9.18 కోట్ల రూపాయలను రుణాలను పంపిణీ  చేశారు. అట్టి తీసుకున్న రుణాన్ని 18 వాయిదా పద్దతి లో చెల్లించాల్సి ఉంటుంది.  
 
 ఇంతకు ముందు చిరువ్యాపారులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీకి అప్పు గా తీసుకొని వ్యాపారం చేసుకునే వారు. ఈ నేపథ్యం లో   వ్యాపారం లాభసాటిగా ఉండేది కాదు  దాన్ని అధిగమించేందుకు ఈ పథకం  చిరు వ్యాపారులకు ఎంతో మేలు   చేకూరుతుంది. పండ్లు, కూరగాయలు, కొబ్బరి బోండాలు, టీ కోట్లు, ఇస్త్రీ , రోడ్డుపై బట్టలు, ఇతర వస్తువులు  అమ్ముకునే వాళ్ళందరూ  ఈ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చును.
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here