Spread the love
మా పల్లె రంగులు
రైతులు పండించిన పొలాల “పచ్చ” దనపు పైర గాలి రమ్మని పిలిస్తే..
కొండల్ని చీల్చుకుంటూ సూర్యుడు “ఎరుపు” వెలుగుతో ఆహ్వానిస్తాడు..
ఆవుపాల నురుగు “తెలుపు” వలె వారి మనసు తలుపులు తెరిస్తే..
ఇంటి గుమ్మానికి రాసిన “పసుపు” పనికట్టుకుని మరీ పలకరిస్తాయి…
పసిపిల్లల చిలిపి అల్లర్లు “నీలి” మేఘ శ్యాముడిని తలపిస్తే..
వారి కష్టం “నలుపు” తెరలు దాటి “బంగారు వెలివి” ఛాయ లో ఇంద్రధనుస్సే తన భుజా లపై మోసుకురాదా?.
ఇదే కాదా మా పల్లెల “రంగుల” రమణీయ దృశ్యాలు..
చేదిరిపోనివి…
మాసిపోనివి…
మా రంగులు…
హోలీ శుభాకాంక్షలతో
తుమ్మల కల్పనా రెడ్డి..