అమ్మాయి మనస్సులో మాట
నీ మనసు పంజరంలో చిక్కుకున్న చిలకను…
నీ కంటి చూపులో బందించబడిన ఖైదీని…
నీ చేతిలో ఎగురుతున్న గాలిపటాన్ని..
నీ గొంతులో దాగిఉన్న సుస్వరాన్ని..
నీ దాహాన్ని తీర్చే నీటిచుక్కని..
నీ కోపంలో మండుతున్న ఏరుపుని…
నీ కలలలో దాగిఉన్న నిజాన్ని,..
నీ చిరునవ్వులో మెరిసే అమృతపు బిందువు ని..
నీ జీవితంలోకి వచ్చిన అనుకోని అతిథిని నేను…
– తుమ్మల కల్పనా రెడ్డి
Post Views:
812
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4