కేసు న‌మోదైనా….ఇంత వ‌ర‌కు అరెస్టు కాని మిసెస్ ఇండియా

0
192
Spread the love

అధిక శాతం వ‌డ్డీతో.. రుణం తీసుకున్న వారిని తీవ్రంగా హింసిస్తున్న మిసెస్ ఇండియాపై పోలీసు కేసు న‌మోదై‌న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత వ‌ర‌కు ఆమెను మాత్రం అరెస్టు చేయ‌లేదు. ఆమె పోలీసుల‌ను కూడా ప్ర‌భావితం చేస్తోంది క‌న‌క‌నే…. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని బాధితుడు వాపోతున్నాడు. ఎంతో కాలంగా ఆమె ఇలాంటి ఘ‌తుకాల‌కు పాల్ప‌డుతున్నా… ఈమెపై ఇంత వ‌ర‌కు కేసు న‌మోదు కాలేదు. మిసెస్ ఇండియా వ‌ల్ల తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ఒక బాధితుడు చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదైంది. బాధితుడు అందించిన వివ‌రాల ప్ర‌కారం…. బాధితుడు సికింద్రాబాద్‌లో కార్యాల‌యం నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియాల్ ఎస్టేట్ వ్యాపారానికి డ‌బ్బులు అవ‌స‌రం అవ‌డంతో తెలిసిన వారి ద్వారా ఈయ‌న సైబ‌రాబాద్ ప‌రిధిలో ఉండే మిసెస్ ఇండియాను క‌ల‌వ‌డం జ‌రిగింది. ఆమె వ‌ద్ద నుంచి రూ.28.5 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నాడు. ఇందుకు గాను ఆమె బ్లాంక్ చెక్కులు… ప్రామీస‌రీ నోట్లు కూడా తీసుకుంది. బాధితుని భార్య పేరుతో కూడా చెక్కు‌లు .. ప్రామీస‌రీ నోట్లు తీసుకుని ఆమె రుణం ఇచ్చింది. ఆ త్వ‌రాత బాధితుడు స‌ద‌రు న‌గ‌దు పూర్తిగా బ్యాంకు ద్వారా చెల్లించాడు. ఆ త‌ర్వాత ఆమె త‌ను సంత‌కాలు చేసిన ప‌త్రాలు తిరిగి ఇవ్వ‌లేదు. అంతే కాకుండా రూ.కోటి రూపాయ‌ల‌కు పైగా త‌న వ‌ద్ద రుణం తీసుకున్నాడంటూ మిసెస్ ఇండియా వాటిని తిరిగి ఇవ్వాల‌ని లీగ‌ల్ నోటీసు పంపించింది.

ఇదేంట‌ని ప్ర‌శ్నించిన త‌న‌ను ఆమె బెదిరించింద‌ని బాధితుడు వాపోతున్నాడు. ఎంతో మాన‌సిక వేధ‌న‌కు గురైన బాధితుడు చివ‌ర‌కు పోలీసు కేసు పెట్టాడు. కేసు న‌మోదై రోజులు గ‌డుస్తున్నా ఇంత వ‌రు ఆమె అరెస్టు జ‌ర‌గ‌డం లేదు. దీంతో బాధితులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే….. మీరు మీ అమ్మ‌నో….భార్య‌నో…. చెళ్ల‌లినో అమ్మేసి మ‌రీ న‌గ‌దు క‌ట్టండంటూ వేధిండ‌మే కాకుండా బాధితుల‌ను తీవ్ర మ‌నోవేధ‌న‌కు గురిచేసిన‌ ఆమెను ఇంత వ‌ర‌కు పోలీసులు అరెస్టు చేయ‌క‌పోవ‌డం శోచ‌నీయం.

Read This News also

హైదారాబాద్ టు గోవా స్థాయిలో న‌గ‌రంలో గాంబ్లింగ్‌ సంతోష్ దాబాపై పోలీసుల దాడితో బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here