భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే పై పోలీసు కేసు
భూ వివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై కేసు నమోదైంది. కోర్ట్ ఆదేశాలు తో కేసు నమోదు చేసిన పోలీసులు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూ వివాదం లో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ ఎమ్మెల్యే తో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ మీద కూడా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 1206,166a,167,168,170,171,447,468,471,307,506 కింద కేసు నమోదు చేశారు. Mla సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టు కు వెళ్లారు.
వాళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలియదు – ఎమ్మెల్యే
ప్రభుత్వ భూమి కి సంబంధించి నేను ఎక్కడ కుడి డబ్బులు అడగలేదు, వాళ్ళు ఎవ్వరో కూడా తెలియదని, ప్రభుత్వ భూమి అయితే రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని అంతే తప్ప ఎక్కడ కూడా డబ్బులు అడిగిన మాట ఉంటే నిరూపించండి. వాళ్ళు కోర్టు నుండి కేసు నమోదు చేసారు. పోలీసులు విచారణ చేస్తే నిజానిజాలు తెలుస్తాయి అని ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి అన్నారు.