మిసెస్ ఇండియాపై న‌మోదైన పోలీసు కేసు

0
155
Spread the love

అధిక శాతం వ‌డ్డీతో.. రుణం తీసుకున్న వారిని తీవ్రంగా హింసిస్తున్న మిసెస్ ఇండియాపై పోలీసు కేసు న‌మోదైంది. మిసెస్ ఇండియా అస‌లు స్వ‌రూపం పేరుతో ఇప్ప‌టికే తూఫాన్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. లోన్ యాప్ బాధితుల కంటే….తీవ్రంగా ఈమె రుణం తీసుకున్న వారిని బాధించి‌న‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. ఎంతో కాలంగా ఆమె ఇలాంటి ఘ‌తుకాల‌కు పాల్ప‌డుతున్నా… ఈమెపై ఇంత వ‌ర‌కు కేసు న‌మోదు కాలేదు. మిసెస్ ఇండియా వ‌ల్ల తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ఒక బాధితుడు చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదైంది. బాధితుడు అందించిన వివ‌రాల ప్ర‌కారం…. బాధితుడు సికింద్రాబాద్‌లో కార్యాల‌యం నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సైనిక్‌పురీలో నివాస‌ముంటున్నాడు. త‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి డ‌బ్బులు అవ‌స‌రం అవ‌డంతో తెలిసిన వారి ద్వారా ఈయ‌న సైబ‌రాబాద్ ప‌రిధిలో ఉండే మిసెస్ ఇండియాను క‌ల‌వ‌డం జ‌రిగింది. ఆమె వ‌ద్ద నుంచి రూ.28.5 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నాడు. ఇందుకు గాను ఆమె బ్లాంక్ చెక్కులు… ప్రామీస‌రీ నోట్లు కూడా తీసుకుంది. బాధితుని భార్య పేరుతో కూడా చెక్కు‌లు .. ప్రామీస‌రీ నోట్లు తీసుకుని ఆమె రుణం ఇచ్చింది.
ఆ త్వ‌రాత బాధితుడు స‌ద‌రు న‌గ‌దు పూర్తిగా బ్యాంకు ద్వారా చెల్లించాడు. ఆ త‌ర్వాత ఆమె త‌ను సంత‌కాలు చేసిన ప‌త్రాలు తిరిగి ఇవ్వ‌లేదు. అంతే కాకుండా రూ.కోటి రూపాయ‌ల‌కు పైగా త‌న వ‌ద్ద రుణం తీసుకున్నాడంటూ మిసెస్ ఇండియా వాటిని తిరిగి ఇవ్వాల‌ని లీగ‌ల్ నోటీసు పంపించింది. ఇదేంట‌ని ప్ర‌శ్నించిన త‌న‌ను ఆమె బెదిరించింద‌ని బాధితుడు వాపోతున్నాడు. ఎంతో మాన‌సిక వేధ‌న‌కు గురైన బాధితుడు చివ‌ర‌కు పోలీసు కేసు పెట్టాడు. ఇలాంటి వారికి ఎలా మిసెస్ ఇండియా కిరీటాన్ని ఇచ్చార‌ని ప‌లువురు వాపోతున్నారు. ఈమె బారిన ప‌డ్డ బాధితులు మ‌రింత మంద ఉన్నార‌ని తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here