ఎక్క‌డ ఆటవిక రాజ్యం ఉన్నా… పోలీసులు రాజకీయానికి బానిసలే

0
107
Spread the love

ఆటవిక రాజ్యం బీహార్ .. పోలీసులు రాజకీయానికి బానిసలే.. ప్రస్తుత తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను పరికిస్తే సత్యావలోకనం అలాగే వున్నట్లు తోస్తోంది. తెలంగాణా రాష్ట్రంలో ఓ ముఖ్యమైన మంత్రి గారు ముఖ్యమంత్రి చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారిన ప‌రిస్థితిని చూస్తూనే వున్నాము. ఒక్క 3 రోజుల్లో మంత్రిగారి మంత్రిత్వం పీకి పడేయడం, వారి మీద ఆరోపణ విచారణ చేయడం, మాజీ మంత్రిగారు పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే గిరికి రాజీనామా, పోలీసులు దేశద్రోహులకు చూపించే పరిస్థితులను మాజీ మంత్రిగారికి చూపే పరిస్థితి. ఈ కథ‌నంలో పాత్రలు చెప్పనవసరం లేదేమో.

అంధ్రరాష్ట్ర కధ, ప్రజలు అంటే ప్రభుత్వానికి అవసర వర్గాలకు లక్షలు, కోట్లలో తాయిలాలు అందించబడ్డాయి. దేవాలయాలు ధ్వంసం, అభివృద్ధి శూన్యం, మంత్రులను ప్రశ్నించారా అమ్మనా బూతులు. అడెమ్మ మొగుడు సొత్తా, ఈడెమ్మ ఈడు చేసేదేమిటి.. రౌడీ షీటర్లు మంత్రులు, పోలీసులు వారి పాదాల చెంత. ఈరోజు వీరిని నిర్బంధించాలి అంతే దానికి ఒక తీరు తెన్ను వుండదు అంటే న్యాయిక వ్యవస్థ వుండదు ఇంటికి రావాలి తీసుకొని పోవాలి. మా ము.మ. గారికి ప్రియమైన సేవ. కరోనా, ప్రజారోగ్యం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి వుండవు. నోరువున్నదా జైలుకి లేదా చావుకి అంతే…

ఇది ఎలా వున్నది అంటే మనం బీహార్ రాష్ట్రం వైపుకు 1995 కు ఒక్కసారి చుస్తే అర్ధం అవుతుంది. లాలూ ప్రసాద్ యాదవుగారి పాలన. పశువులకు గడ్డికోసం కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి సీఎం గారే స్వయానా తీయడం. ఈ పెద్ద పశువు మింగేయడం. ఆ పాపం ఇప్పుడు వెంటాడి జైలు ప్రాప్తి. రోడ్లు వందల కిలోమీటరులు వేశారని ఖజానా నుండి డబ్బు తీయుట అది ఎవరి ఖాతాకి పోయాయో అర్ధం అవుతుందని భావిస్తాను…బూతు ఆటవికం ఇప్పుడు చెబుతాను.
చంపావిశ్వాస బీహార్ కేడర్ IAS సమాజకళ్యాణ బోర్డులో పోస్టింగ్, పాట్నా. బెంగాలు వాసి పెళ్లి చేసుకొని పాట్నా గవర్నమెంటు క్వార్టరులో నివాసం.
హేమాలతయాదవ్, MLA, సమాజకళ్యాణ బోర్డు చైర్మన్ గారు. వీరు కూడా క్వార్టరులో నివాసం.
హేమాలతగారి అబ్బాయి మృత్యుమ్ జయయాదవ్ 28 సం.
చంపావిశ్వాస్ గారి భార్యను చూశాడు మోజుపడ్డాడు. వెంటనే ప్లాను అమలు. ఈ కుర్రాడు పక్క క్వార్టరులో వున్నా చంపావిశ్వాస్ భార్య గారి దగ్గరకు వచ్చి మా అమ్మగారికి బాగుండలేదు కాస్త చూస్తారా అన్నాడు. సాటివారు, తన భర్త బాసు గారు ఈమె వెంటనే వెళ్లింది. ఈమెను ఓ గదిలోకి తీసుకొని పోయాడు బయట వందిమాంగదులు తలుపు మూశారు 7.9.1995 రేపు చేసేశాడు. ఏడుస్తూ బయటికి వచ్చిన ఆమె బయటివారి నవ్వులు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపు. అప్పుడు మొదలు రెండు సంవత్సరాలు ఎప్పుడంటే అప్పుడు, కెమెరా ముందు కూడా అదే పని అదే రేపు.
ఇంతటితో ఆగని ఆ నేత కుమారుడు ఆమె తల్లిని చూసి ముచ్చట పడ్డాడు. తల్లిదగ్గర భోరున విలపించిన ఆవిడ, ఆతల్లి కూతురుకోసం లొంగిపోయింది, తల్లితో పాటు వచ్చిన అమెసోదరిని బంధించి రేపు. వీడే కాదు వీడి స్నేగితులు కూడా ఇదే తతంగం. ఈ అగడాలు భరించలేక పోలీసుల దగ్గర గోడు చెప్పుకుంటే. మీ పరువు పోతుంది మీరు సర్దుకొండి అని సలహా. కేసు తొక్కిపెట్టిన పోలీసుబాసు.

1997లో శ్రీ సుందరసింగ్ భాండారి, గవర్నర్, భాజపా నుంచి. ఆయనకు ఫిర్యాదు చేసిన ఈమె. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీహార్ శ్రీ సుశీల్ మోడీ పత్రికా విలేకరుల సమావేశంలో విషయ ప్రస్తావన. ఆనాటి హోమ్ మినిష్టర్ అభినవ సర్దార్ అద్వానీగారు పట్టించుకోగ. పోలీసులకు తప్పని పరిస్థితి. క్రింది కోర్టు మృత్యుమ్ జయ్ గాడికి జైలు శిక్ష విధిస్తే, తల్లి పరారు.
మరచానండోయ్ ఈతల్లిని ఆ కొడుకు అడిగాడట చంపా గారి పెళ్ళాన్ని పెళ్లిచేసుకుంటాను అని. ఎందుకట అంటే, ఆమె, ఆమె తల్లి, చెల్లి ఇంతమందిని అనుభవించవచ్చును అని. వెంటనే తల్లి రాయబారం. లాలూతో చెప్పి నీకు మంచి పోస్టు ఇప్పిస్తాను. నాకొడుకు ముచ్చట తీర్చమని.
ఈలోపు ఇదంతా జరిగి తల్లి పరారు. 2 నెలల తరువాత పోలీసులకు లొంగుబాటు.
కేసు హైకోర్టుకు అప్పటికి 3 సం. తల్లి జైలులో వుండి, కొడుకు 5 సం. జైలులో వుండి బైలు మీద బయటికి. హైకోర్టు పది సం. కొడుకుకు జైలు విధిస్తే, తల్లి కి 3 సం లు విధిస్తే, ఈమె బయటకు. ఆడు లోపలికి.
ఈ చంపేస్ విశ్వాస కుటుంబ సమేతంగా ఢిల్లీ పారిపోవడం. బిహార్ విభజనతో chattisghad పోస్టింగ్ వచ్చి పాట్నా నుంచి బయటకు పోయిన చంపావిశ్వాస్.

ఈ కధ ఒక బ్రోతలు కధ కాదు. ఓ IAS. ఆఫీసరు కధ. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కవుతే జరిగే అనర్ధం. ఇంకా ఎంతో జరిగింది. ఇంతమటుకు ఆటవిక రాజ్య పాలన అర్ధం చేసుకోగలిగితే చాలు.

మరి తెలంగాణా ము.మ. గారు ఆంధ్ర ము.మ. గారు ఇప్పుడు ప్రజలకు జవాబుదారీ లాగా కనబడుతున్నారని భావిస్తారా?

బీహార్ కధనం 1997 ప్రాంతంలో ఒక మీడియా మాత్రమే ప్రజలకు చేర్చింది. ఆలోచించండి పాత్రికేయ మిత్రులారా? పవిత్ర వృత్తిని అమ్ముకుని ఆత్మద్రోహం చేసుకోకండి…

Writes Anasuya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here