పేద డబ్బింగ్ ఆర్టిస్టులకి నిత్యావసర సరుకులు పంపిణి
ఆపదకాలంలో పేదవారిని ఆదుకోవడం చాలా అవసరం అని భారతీ శంకర పీఠం గురువు అన్నవరపు తిరుపతి మూర్తి పేర్కొన్నారు. భారతీ శంకర పీఠం, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేద కళాకారుల కుటుంబాలకి నిత్య అవసరం సరుకులను అన్నవరపు తిరుపతి మూర్తి, వారి కుమారుడు దత్త ఆంజనేయ శాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా సతీమణి లలిత కలిపి కలిపి డా.ఎర్రం పూర్ణశాంతి గుప్తా సూచనల మేరకు డబ్బింగ్ యూనియన్ సంస్థ కార్యాలయం లో నిరుపేదలకు సరుకులను అంద చేశారు. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి పేరుతో డా.ఎర్రం పూర్ణశాంతి గుప్తా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వీరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డబ్బింగ్ కార్యవర్గ సభ్యులు సెక్రటరీ దామోదర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లెలిన చౌదరి, కార్యవర్గ సభ్యులు మెంబర్ మంగరాజు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు, సోషల్ సర్వీస్ ఐకాన్ పుట్టా రామకృష్ణ పాల్గొన్నారు.