బాలికల బంగారు భవిష్యత్తు కోసం తపాలా శాఖ కొత్త కార్య‌క్ర‌మం

0
77
Spread the love

అంత్యోదయ సుకన్య సమృద్ధి: బాలికల బంగారు భవిష్యత్తు కోసం తపాలా శాఖ ద్వారా సహాయం చేసే అవకాశం

హైదరాబాద్ – బాలికలపట్ల వివక్ష, అణచివేతను పారదోలేందుకు ప్రభుత్వంతో పాటు అనేక మంది కృషి చేస్తున్నారు. ఈ కృషిలో మీరూ భాగస్వామి అయ్యేందుకు తపాలా శాఖ ఒక సదావకాశాన్ని కల్పిస్తోంది. తమవంతుగా నిరుపేద కుటుంబాలలో ఉన్న బాలికల విద్య, ఉన్నతి కోసం సహాయం చేయడానికి అంత్యోదయ సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా ఈ అవకాశం ఇస్తోంది. 

అనేక పన్ను రహిత పెట్టుబడి పథకాలను అందించే పోస్టల్ శాఖ బాలికల కష్టాలను తొలగించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. నిరుపేద కుటుంబంలో బాలికల భవిష్యత్తు కోసం కేంద్రప్రభుత్వం ‘‘బాలికలను రక్షిద్దాం-బాలికలను చదివిద్దాం’’ (బేటీ బచావో-బేటీ పడావో) ని ప్రారంభించింది. దాతలు తమకు తెలిసిన నిరుపేద కుటుంబాలలో 10 సంవత్సరాల వయస్సు లోపు బాలికలకు అందుబాటులో ఉన్న పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా రూ. 250 జమ చేసి సహాయం చేయడానికి అవకాశం కల్పించింది. దాతలకు తెలిసిన నిరుపేద బాలికలు లేనట్లయితే దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయంలో సంప్రదించి నిరుపేద బాలికలకు సహాయం చేయవచ్చు. దాతలు తమ సహాయంతో నిరుపేద కుటుంబాలలోని బాలికల విద్య, ఉన్నతి కోసం కృషి చేసేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తోంది.

దాతలు నిరుపేద బాలికల కోసం రూ.250 చెల్లించి అంత్యోదయ సుకన్య సమృద్ది ఖాతా ప్రారంభిస్తే  తపాలా శాఖ వారిని ‘ఆప్తమిత్ర’గా గుర్తిస్తుంది. అదే దాత ప్రతినెలా లేదా వార్షికంగా ఖాతాలో జమచేస్తే ‘ఆప్త బంధువు’గా గుర్తిస్తుంది. 

మరింత సమాచారం కోసం దాతలు తమ దగ్గరిలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించవచ్చు.. లేదా 040 23463701/729, [email protected], [email protected]  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here