ప్రజాకలం జర్నలిస్టును బెదిరిస్తున్న సొసైటీ చైర్మన్

0
87
Spread the love

ప్రజాకలం జర్నలిస్టును బెదిరిస్తున్న సొసైటీ చైర్మన్

వరి ధాన్యం కొనుగోలు పై వార్త ప్రచురించిన విలేకరిపై నీ అంతు చూస్తాం అంటూ ఫోన్లో బెదిరింపులు

మితిమీరిపోతున్న ఆయ‌న ఆగ‌డాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

ఖండిస్తున్న జ‌ర్న‌లిస్టులు

మెదక్ మే 18(తూఫాన్‌) – కొల్చారం మండల పరిధిలోని అంసాన్ పల్లి సహకార సంఘం అధ్యక్షుని వల్ల తనకు ప్రాణహాని ఉందని కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఒక విలేకరి కొల్చారం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా కొనుగోళ్ళు జరగడం లేదు లారీల కొరత మాలీల కొరత పేరుతో ధాన్యం తూకం వేయడం లేదు ఇటీవల కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్ధఅవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై ప్రజాకలం దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురించడంతో సహకార సంఘం అధ్యక్షులు మన్నె రాములు బుధవారం ఉదయం ప్రజాకలం దిన పత్రిక విలేఖరి పాండురంగచారికి ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో దూషిస్తు నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.దమ్ముంటే అంసాన్ పల్లికి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు.దీంతో తనకు మన్నే రాములు వల్ల ప్రాణహాని ఉందంటూ పాండురంగచారి బుధవారం విలేకరులతో కలిసి కొల్చారం పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here