Spread the love
ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా
న్యూఢిల్లీ ఏప్రిల్ 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. తాజాగా ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వాద్రాతోపాటు ఆమె కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండిపోయారు.