కరోనా సహాయ యోధుడి అవార్డు అందుకున్న పుట్టా రామకృష్ణ

0
154
Spread the love

కరోనా సహాయ యోధుడి అవార్డు అందుకున్న పుట్టా రామకృష్ణ

ప్రముఖ సోషల్ ఆక్టీవిస్ట్ పుట్టా రామకృష్ణ కరోనా సహాయ యోధుడి అవార్డు అందుకున్నారు. ఆదివారం శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆద్వర్యం లో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కరోనా సమయం లో సహాయ సహకారాలు అందించిన “ కరోనా సహాయ యోధుడి అవార్డు” లు ప్రధానం చేసారు. తెలంగాణ లో ఎంపిక చేసిన 21 మంది కి అందించిన అవార్డు కి గాను కరోనా సమయం లో సంఘసేవకులు పుట్టా రామకృష్ణ సినీ కార్మికులను, పేదప్రజలకు అందించిన సేవలకు మెచ్చి తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మల్కాజిగిరి కోర్ట్ జడ్జ్ బూర్గుల మధుసూదన్, కాచం ఫౌండషన్ చైర్మన్ కాచం సత్యనారాయణ, డా.ఎర్రం పూర్ణ శాంతి గుప్తా, చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమానికి సినీ యాక్టర్స్ సంధ్య జనక్, తేజస్వి తోట, సోషల్ వర్కర్ డా.సంపత్ కుమార్ అతిధులుగా పాల్గొన్న కార్యక్రమం లో పుట్టా రామకృష్ణ అందించిన సేవలు గూర్చి సంస్థ ఫౌండర్ డా.ఎర్రం పూర్ణ శాంతి, కాచం ఫౌండషన్ చైర్మన్ కాచం సత్యనారాయణ పలువురికి తెలియజేసారు. రామకృష్ణ సేవలు తెలుసుకొని అతిధులు అభిఞ్ఞాధించారు. రామకృష్ణ తోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 20 మందికి అవార్డ్స్ అందించారు. అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని, అవార్డు ఇచ్చిన సందర్భంగా డా.ఎర్రం పూర్ణ శాంతి కి, అతిధులకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here