కెసిఆర్ అనూహ్య నిర్ణయం.. ఎంఎల్‌సి అభ్యర్థిగా…
మాజీ ప్రధాని పి.పి కుమార్తె సురభి వాణిదేవి
హైదరాబాద్ : పట్టభద్రుల కోటా ఎంఎల్‌సి అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టిఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్ విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఆదివారం కెసిఆర్ అభ్యర్థిని ప్రకటించారు. కాగా తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నరెండు పట్టభద్రుల కోటా ఎంఎల్‌సి ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఖమ్మం-నల్గొండ-వరంగల్ స్థానం నుంచి ఫ్రొపెసర్ కోదండరామ్(టిజెఎస్), రాములు నాయక్ (కాంగ్రెస్), పల్లా రాజేశ్వరరెడ్డి (టిఆర్ఎస్), విజయసారథి రెడ్డి(సిపిఐ), తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి (బిజెపి)లు బరిలో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి (కాంగ్రెస్) రామచంద్రారెడ్డి (బిజెపి), ఫ్రొపెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. తాజాగా టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నిక రసవత్తరం కానుంది. పట్టభద్రుల కోటా ఎన్నిక కావడంతో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కెటిఆర్ ఇప్పటికే పలు విడతల వారిగా సమావేశాలు నిర్వహించారు. పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి ఉంది. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోంది.
Post Views:
254
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4