Spread the love
పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం…గవర్నర్
ముగిసిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నగరంలోని పీవీ మార్గ్ లో వున్న జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ ను ప్రారంభించారు. పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్, ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడారు