హైదరాబాద్ శివారులో వరుస ఎటిఎం చోరీల నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఎల్బీ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎటిఎం చోరీలకు పాల్పడుతున్న ముఠా హర్యానాకు చెందిన అంతర్ రాష్ట్ర ముఠాగా రాచకొండ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.. ఎటిఎం సెంటర్ లో ఉన్న నిర్వహణ లోపాలను (సీసీ కెమెరాల, అలారం సిస్టం లేకపోవడాన్ని) గుర్తించి ఆ ముఠా సులభంగా చోరీలకు పాల్పడుతున్నారని, నిబంధనలు పాటించని బ్యాంకర్ లకు నోటీసులు ఇస్తామని, ఇంతకు ముందు బ్యాంకర్ లతో ఇలాంటి ఘటనలు ఎదురవుంటుందని వారికి సీసీ కెమెరాల, బ్యాంకులలో అలారం సిస్టర్ పెట్టుకోవాలని సూచించమని గుర్తు చేశారు. మరో దఫాలుగా బ్యాంకర్లతో మీటింగ్ నిర్వహిస్తామని,. ఎటిఎంలో జరిగే చోరీలని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ యాదగిరి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views:
103