సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా రాజమౌళి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

0
66
Spread the love

ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బి. రాజమౌళికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అడిషనల్ డైరెక్టర్స్ నాగయ్య కాంబ్లె, LLR కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్స్ D.S. జగన్, D.శ్రీనివాస్, KV రమణ, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వర రావు , GHMC CPRO Md మూర్తుజా, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ లు ఎం. మధుసూదన్, యాసా. వెంకటేశ్వర్లు, పాండురంగారావు, జీ. ప్రసాదరావు, రాజారెడ్డి, KV సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర అధికారులు, ఉద్యోగులు శాఖ డైరెక్టర్ బి.రాజమౌళికి అభినందనలు తెలిపారు.

 

సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు , సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ల ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను పటిష్టపరచనున్నట్లు శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here