రేపటి కల్లా పాఠశాల ప్రారంభానికి సిద్ధం చేయాలి : కలెక్టర్ అనురాగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమంలో మంత్రి కే తారక రామారావు ఆదేశాల నేపథ్యంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పందించి కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. తన తండ్రి మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే పాఠశాల భవన నిర్మాణం పూర్తి అయ్యింది. కాగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పాఠశాల భవనం ను జిల్లా విద్యాధికారి డి రాధా కిషన్, ప్యాకేజీ-9 ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సందర్శించారు. పాఠశాలలో వసతులు, క్లాస్ రూం లు, ఫర్నీచర్, కిచెన్ షేడ్ లను పరిశీలించారు. పాఠశాల ఆవరణను లెవెలింగ్ చేయాలన్నారు. పాఠశాలను రేపటి కల్లా ప్రారంభానికి సిద్ధం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆదేశించారు.