“కార్పొరేట్ మేనేజ్ మెంట్ దిగ్గజం” ఆర్.సి. శాస్త్రి కన్నుమూత

0
385
Spread the love

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “మేనేజ్ మెంట్ రంగం”లో ఆద్యుడు, ఎంతో మంది శిష్య ప్రశిష్యులకు ఆరాధ్యుడు శ్రీ రాళ్లభండి చంద్రశేఖర శాస్త్రి గత గురువారం నాడు స్వల్ప అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన వయస్సు 78. శ్రీ శాస్త్రి గారికి భార్య కమలాదేవి, కుమార్తె రత్నావళి, కుమారుడు సునీల్ వున్నారు. కార్పొరేట్ రంగంలో చక్కని వ్యూహకర్త, ప్రసిద్ధులు, మెంటర్, అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్ధల ప్రగతిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రి గారి పేరు తెలుగు కార్పొరేట్ రంగంలో తెలియని వారు లేరు. డాక్టర్ శాస్త్రి తొలుత ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ (సోషియల్ వర్క్ లో గోల్డ్ మెడల్) పూర్తి చేసుకున్న తర్వాత ఆలిండ్ మియజాకీ లో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కొంత కాలం పాటు పనిచేసిన తర్వాత కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించారు. అలా మొదలైన ఆయన కార్పొరేట్ ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఐటిసి, ఐ ఎల్ టి డి, వి.ఎస్. టి, వంటి సంస్థల్లో హెచ్ ఆర్ చీఫ్ గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, సత్యం కంప్యూటర్స్ ప్రథమ హెచ్ ఆర్ డైరెక్టర్ గా అనేక సమున్నత పదవుల్లో కొనసాగింది. అంతేకాకుండా ఆయన కార్పొరేట్ వ్యూహకర్తగా అనేక అంతర్జాతీయ కంపెనీల ఎదుగుదలలో ప్రధాన పాత్ర నిర్వహించారు. అనేక మంది సిఇ వోల మెంటర్ గా కార్పొరేట్ రంగంలో మానవతా విలువలకు, ధార్మిక ఆలోచనలకు పథ నిర్దేశనం చేశారు. ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవతా విలువలను రంగరించి టీమ్ లీడర్స్ కు ఆదర్శంగా నిలిచారు. నిరంతర జ్ఞానార్జనే ధ్యేయంగా “మేనేజ్ మెంట్ రంగం” లో ఎం ఫిల్ లో డిష్టింక్షన్ సాధించడమేకాకుండా రెండు డాక్టరేట్ లు పొందారు. పైగా డాక్టర్ శాస్త్రి ఎన్నో విలువైన గ్రంథాలను రచించారు. అందులో “ధార్మిక్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్” ముఖ్యమైనది. నిరంతర జ్ఞానార్జనే ధ్యేయంగా “మేనేజ్ మెంట్ రంగం” లో ఎం ఫిల్ లో డిష్టింక్షన్ సాధించడమేకాకుండా రెండు డాక్టరేట్ లు పొందారు. పైగా డాక్టర్ శాస్త్రి ఎన్నో విలువైన గ్రంథాలను రచించారు. అందులో “ధార్మిక్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్”, ” management theory and practice – insights” ” ముఖ్యమైనవి. వీటిలో ధార్మిక్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్”, గ్రంధానికి గాను ప్రతిష్ఠాత్మక ఐ ఓ సి, ఐ ఎస్. టి. డి జాతీయ అవార్డు లభించింది. సాహిత్యం పట్ల ఎంతో మక్కువ కలిగిన డాక్టర్ శాస్త్రి “స్టోన్ కార్టర్” అనే సంస్థను స్థాపించి అనేక గ్రంథాలను ప్రచురించారు. పైగా సరళ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఆయన అనేక విశిష్ట సంస్కృత గ్రంధాలను తెలుగు అనువాదం చేయించి ప్రచురించారు. వాటిలో ఙివివి సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రానువాదం చేసిన మహాకవి కాళిదాస విరచిత రఘువంశం, కుమార సంభవం వంటి గొప్ప పుస్తకాలు ఉన్నాయి. ఇంకా సంగీత కళానిధి శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గాత్రంలో “శివ సహస్ర నామం” ఆల్బం విడుదల చేశారు. డాక్టర్ శాస్త్రి మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఆయన శిష్యులు, కార్పొరేట్ దిగ్గజాలు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here