వాళ్ల వల్ల మా సినిమా ఆగింది
కానీ ఇప్పుడు…!!
మాస్ మహారాజా రవితేజ అభిమానులు నేటి ఉదయం నుంచి ఎంతో నిరాశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెరపై రవితేజను చూస్తామా? అని ఎదురుచూడసాగారు.కానీ వారు ఆశలు ఆవిరి అవుతూనే వచ్చాయి. ఫ్యాన్సీ షోలు, బెనిఫిట్ షోలు ఇలా అన్ని క్యాన్సిల్ అయ్యాయి. కనీసం మార్నింగ్ షో వరకు అయినా సమస్యలన్నీ తొలగిపోయి సినిమా వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ మ్యాట్నీ షో కూడా వాయిదా రద్దు చేసేశారు. నిర్మాత ఠాగూర్ మధు చేసిన అప్పులు, అంతకు ముందు సినిమాల విషయంలో తేలని లెక్కల వల్ల ఇప్పుడు క్రాక్ సినిమాపై ప్రభావం పడింది.టెంపర్ రీమేక్ అయోగ్య విషయంలో ఈ గొడవలు జరిగాయని ఒకరు.. స్పైడర్ సినిమా విషయంలో ఈ గొడవ జరిగిందని ఒకరు అంటున్నారు. మొత్తానికి ఈ గొడవ ఇక తేలదు.. సినిమా విడుదల అవ్వదని అందరూ అనుకున్నారు. సమస్య వచ్చింది ఆరు కోట్లు వల్ల అని కొందరు కాదు పది కోట్లు అంటూఇంకొందరు రాసుకొచ్చారు.
ఏది ఎలాగున్నా కూడా రవితేజ అభిమానులకు మాత్రం ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి క్రాక్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మేరకు డైరెక్టర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అన్ని సమస్యలు తొలగిపోయాయ్.. ఫస్ట్ షో నుంచి క్రాక్ వస్తుందంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ చేయడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. మొత్తానికి క్రాక్ విడుదలపై వచ్చిన రూమర్లన్నీ చెదిరిపోయాయి.
Post Views:
331
google-site-verification=NDWDH_N3xg9vLPryf2hWnvSPzP0lj6MvXu0fdqeC-e4