రా, ఐబీ చీఫ్ పదవీకాలం పొడగింపు
న్యూఢిల్లీ మే 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్;:) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ అరవింద్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది. వీరిద్దరి పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడగిస్తూ కేంద్రం నిర్ణయించింది. అరవింద్, సమంత్ ఇద్దరూ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. గోయల్ పంజాబ్ క్యాడర్ నుంచి, కుమార్ అసోం-మేఘాలయ క్యాడర్ అధికారులు.2019 ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడి, 2016 సర్జికల్ స్ట్రైక్ వ్యూహాలలో సమంత్ కుమార్ గోయల్ పాల్గొన్నారు. అతను పాకిస్తాన్ విషయాల్లో నిపుణుడిగా పేరు గడించారు. 1990 లలో తిరుగుబాటు నేపథ్యంలో పంజాబ్ పరిస్థితిని సమీక్షించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదే సమయంలో అరవింద్ కుమార్ ను జమ్ముకశ్మీర్ నిపుణుడిగా భావిస్తారు.సమంత్ కుమార్, అరవింద్ కుమార్ ఇద్దరూ 2019 జూన్ నెలలో బాధ్యతలు స్వీకరించారు. సమంత్ కుమార్ 2019 జూన్ 26 న రా చీఫ్ గా పదవిని పొందారు. ఆయన స్థానంలో అనిల్ ధస్మానాను నియమించారు. అదే సమయంలో అరవింద్ కుమార్ కూడా అదే రోజు ఛార్జ్ తీసుకున్నారు. రాజీవ్ జైన్ ఆయనకు ముందు ఐబీ అధిపతిగా ఉన్నారు. దాస్మానా, జైన్ డిసెంబర్ 2016 లో నియమితులయ్యారు.